రానా దగ్గుబాటి నయా లుక్..నెటిజన్లు ఫిదా

ఆరడుగుల అందగాడు రానా దగ్గుబాటి..‘‘లీడర్’’ సినిమాతో హీరోగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత వరుస సినిమాలు చేసి తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ సినిమాలు చేసిన రానా..విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు.

రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిన బాహుబలి సినిమాతో భళ్లాల దేవుడిగా ఫుల్ ఫేమస్ అయిపోయాడు. బాహుబలి‌లో రానా నటనకు ప్రేక్షకులు మంత్ర ముగ్దులు అయిపోయారు.

వెండి తెర మీదే కాదు..‘‘నెంబర్ వన్ యారి’’ ప్రోగ్రామ్‌తో రానా..బుల్లి తెర మీద కనిపించి సందడి చేశాడు. సోషల్ మీడియాలో చాలా తక్కువగా కనిపించే రానా లేటెస్ట్‌గా ఒక క్యూట్ ఫొటో షేర్ చేశాడు. చాలా కాలం తర్వాత రానా దగ్గరి నుండి వచ్చిన ఈ పోస్ట్ తో అభిమానులు ఖుషి అవుతున్నారు.

సదరు ఫొటో లో లైట్ బ్లూ షర్ట్ తో కూల్ సన్ గ్లాసెస్ దరించి అలా ఒక వైపు చూస్తున్నాడు. సదరు ఫొటో చూసి నెటిజన్లు ‘‘సూపర్ కూల్, సూపర్’’ అని కామెంట్స్ చేస్తున్నారు. ఉడుగుల వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ‘‘విరాట పర్వం’’ మూవీ జూలై 1 న విడుదల చేయనున్నారు. ఇందులో రానా నక్సలైట్ గా కనిపించనున్నారు.