‘షంషేరా’ టీజర్..ఆ తెగ యోధుడిగా రణ్‌బీర్ కపూర్ వీరోచిత పోరాటం

బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ నటించిన తాజా చిత్రం ‘షంషేరా’. ఈ సినిమా ఫస్ట్ లుక్ తో ఇటీవల నెటిజన్లు, అభిమానులు అందరినీ ఆశ్చర్య పరిచారు రణ్ బీర్. గుబురు గడ్డంతో వెరీ డిఫరెంట్ లుక్ తో అదరగొట్టేశారు.

కరణ్ మల్హోత్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పిక్చర్ లో రణ్ బీర్ కపూర్, వాణి కపూర్, సంజయ్ దత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే నెల 22న ఈ చిత్రం తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల కానుంది.

తాజాగా మేకర్స్ ఈ ఫిల్మ్ టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ తో సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి. టీజర్ లో ‘అధిర’ అలియాస్ బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ వయ్ లెంట్ గా కనిపించాడు. ఓ తెగను కాపాడే యోధుడిగా రణ్ బీర్ కపూర్ అదరగొట్టేశాడు. త్వరలో ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ నెల 24న పిక్చర్ ట్రైలర్ ను విడుదల చేయనున్నారు మేకర్స్.