వారసుడు నుంచి “రంజితమే” సాంగ్ రిలీజ్ !

-

వారసుడు అనే సినిమాతో మొదటిసారిగా డైరెక్టుగా తెలుగులో హీరోగా పరిచయం అవుతున్నారు విజయ్ దళపతి. ఈ చిత్రాన్ని ఒకేసారి తెలుగు, తమిళ్ భాషలలో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రంలో మొదటిసారిగా విజయ్ కి జోడిగా రష్మిక అలరించనుంది. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చారు. ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయనున్నట్లుగా మూవీ యూనిట్ గతంలోనే ప్రకటించింది.

అయితే.. తాజాగా ఈ సినిమా నుండి బిగ్‌ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ఫస్ట్‌ సింగిల్‌ ” రంజితమే” అనే పాటని రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ఈ సాంగ్ లో విజయ్ తలపతి మరోసారి తన స్టెప్పులతో అదరగొట్టాడని చెప్పొచ్చు. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కుష్బూ, మీనా, ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, యోగి బాబు, సంగీత తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news