ఆ హీరోలతో రణ్‌వీర్‌ హంగామా.. ఫొటోస్ వైరల్

-

బాలీవుడ్‌ స్టార్‌ హీరోల్లో ఒకరైన రణ్‌వీర్‌ సింగ్‌ దక్షిణాది తారలతో కలిసి ఆడిపాడారు. వారితో కలిసి దిగిన ఫొటోలను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఎవరితో ఏ సందర్భంలో కెమెరా ‘క్లిక్‌’ అని అందో తెలియజేసే క్యాప్షన్‌ పెట్టి నెటిజన్లను ఆకర్షిస్తున్నారు. వాటిల్లో రణ్‌వీర్‌.. రానాతో కలిసి నవ్వుతూ కనిపించారు.

విజయ్‌ దేవరకొండతో డ్యాన్స్‌ చేస్తూ, యశ్‌తో కలిసి నడుస్తూ, అల్లు అర్జున్‌ను హత్తుకుని, కమల్‌ హాసన్‌ పక్కన కూర్చొని ఉన్నారు. రానా పిక్‌కి ‘గుడ్‌టైమ్స్‌’, విజయ్‌ ఫొటోకి ‘రౌడీ బాయ్స్‌’, యశ్‌ స్టిల్‌కి ‘భాయ్‌’, అల్లు అర్జున్‌కి ‘ప్రేమ గుర్తు’, కమల్‌ను ‘ది ఐకాన్‌’ అని రణవీర్‌ వ్యాఖ్యానించారు. దక్షిణాది నటులపై అంతటి ప్రేమ చూపిస్తున్నందుకు సినీ ప్రియులు రణ్‌వీర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇదంతా.. బెంగళూరు వేదికగా ఇటీవల జరిగిన ‘సైమా 2022 అవార్డుల ప్రదానోత్సవ వేడుక సంగతి. దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన చిత్రాలు, నటులు సాంకేతిక నిపుణుల ప్రతిభను గుర్తించే ఇచ్చే ఈ ‘సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా)’ వేడుక ఈ ఏడాది 10వ వసంతంలోకి అడుగుపెట్టింది. ‘మోస్ట్‌ పాపులర్‌ హిందీ యాక్టర్‌ ఇన్‌ సౌత్‌ ఇండియా’ విభాగంలో రణ్‌వీర్‌ సింగ్‌ అవార్డు అందుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news