Rashmika Mandanna : విజయ్ దేవరకొండ​తో టూర్లపై పెదవి విప్పిన రష్మిక

-

టాలీవుడ్​లో ఓవైపు వరుస సినిమాలు చేస్తూనే.. నేషనల్ క్రష్ రష్మిక బాలీవుడ్​పై ఫోకస్ చేసింది. గుడ్​ బై సినిమాతో హిందీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రాతో మిషన్ మజ్నుతో సందడి చేయనుంది. ఈ సినిమా ప్రమోషన్స్​లోనే రష్మిక బిజీబిజీగా ఉంది. ఈ మూవీ ప్రమోషన్స్​లో భాగంగా ఈ నేషనల్ క్రష్ ఓ ఛానెల్​కు ఇంటర్వ్యూ ఇచ్చింది.

ఈ ఇంటర్వ్యూలో రష్మిక తన గురించి చాలా విషయాలు షేర్ చేసుకుంది. సోషల్ మీడియాలో ట్రోల్స్, నెగిటివ్ కామెంట్స్, విజయ్ దేవరకొండతో రిలేషన్​షిప్ ఇలా చాలా విషయాలు మాట్లాడింది. మరి అవేంటో తెలుసుకుందామా..?

సినిమా రంగంలో విమర్శలు సహజమని రష్మిక అంటోంది. కాకపోతే అవి మితిమీరినప్పుడు మాత్రం తప్పక పెదవి విప్పాలంది. అందుకే ఈ మధ్యకాలంలో ట్రోల్స్‌పై ) స్పందిస్తున్నానని చెప్పింది. ఇటీవల తాను కిచ్చా సుదీప్‌ ఇచ్చిన ఇంటర్వ్యూ చూశానని.. దాని గురించి మాట్లాడుతూ.. ‘‘నాకెంతో ఇష్టమైన ఓ నటుడు ఇచ్చిన ఇంటర్వ్యూని కొన్నిరోజుల క్రితం చూశాను. ఈ రంగంలో ఉన్నప్పుడు పూలదండలే కాదు. రాళ్లు, కోడిగుడ్లు విసిరినా తట్టుకోవాలని ఆయన అన్నారు. నేను దాన్ని అంగీకరిస్తాను. కాకపోతే, ఎదుటి వ్యక్తులు విసిరే రాళ్లు మిమ్మల్ని బాధపెట్టినప్పుడు, ఆ దెబ్బలకు మీకు రక్తం చిందినప్పుడు ఎదురు తిరగక తప్పదు కదా’’ అని చెప్పింది.

విజయ్ దేవరకొండపై స్పందిస్తూ.. ‘‘విజయ్‌ నాకు బెస్ట్‌ ఫ్రెండ్‌. ఇటీవల న్యూ ఇయర్‌ రోజు నేను లైవ్‌లో ఉన్నప్పుడు వెనుక విజయ్‌ వాయిస్‌ వినిపిస్తోందని కామెంట్స్‌ పెట్టారు. వాటిని చూసి మేము నవ్వుకున్నాం. ఎందుకంటే ఆ సమయంలో మరో నలుగురి వాయిస్‌లు కూడా వినిపించాయి . వాటిని ఎవరూ పట్టించుకోలేదు. మేమిద్దరం కలిసి టూర్స్‌కు వెళ్లలేదని, పార్టీలు చేసుకోలేదని ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. ఫ్రెండ్స్‌ అన్నాక కలిసి టూర్స్‌కు వెళ్లడం సహజం’’ అని అసలు సంగతి చెప్పుకొచ్చింది ఈ భామ.

Read more RELATED
Recommended to you

Latest news