త‌మిళ ద‌ళ‌ప‌తిని బుట్ట‌లో వేసుకున్న రష్మిక మందన్నా!

నిజానికి అట్లీ దర్శకత్వంలో విజయ్‌ నటిస్తున్న సినిమాలోనే రష్మిక కథానాయికగా అనుకున్నారట. కొన్ని కారణాల వ‌ల్ల ఆ స్థానంలో నయనతార వచ్చి చేరింది. అప్పుడు మిస్‌ అయినా ఇప్పుడు ల‌క్కీ ఛాన్స్ రష్మిక కొట్టేయడం విశేషం.

సినిమా అనేది ఓ మ్యాజిక్‌. ఎవరి లైఫ్‌ ఎప్పుడు ఎలా టర్న్‌ తీసుకుంటుందో అర్థంకాదు. నటీనటులైనా, మేకర్స్‌ అయినా రాణించాంటే సక్సెసే కొల‌మాణం. ప్రతిభ ఉంటే సరిపోదు, అదృష్టం కూడా కలిసి రావాలి. ప్రతిభ ఉన్నంత మాత్రాన సక్సెస్‌ లేకపోతే ఎవరూ పట్టించుకోరు. టాలెంట్‌తోపాటు సక్సెస్‌ కూడా కావాలి. అప్పుడే మనుగడ సాధ్యమవుతుంది. ఊహించని రేంజ్‌లో నటీనటుల‌ కెరీర్‌ ఉంటుంది.

Rashmika to act in tamil hero vijay movie

రష్మిక మందన్నా ఇప్పుడు అదే స్థాయిలో ఉంది. ‘ఛలో’, ‘గీత గోవిందం’, ‘దేవదాస్‌’తో హ్యాట్రిక్‌ హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంది. దీంతో తెలుగులో హాట్‌ కేక్‌ అయిపోయింది. ఆమెతో సినిమాలు చేయడానికి, తమ సినిమాలో కథానాయికగా ఎంచుకోవడానికి అటు స్టార్‌ హీరోలు, ఇటు దర్శక, నిర్మాత‌లు ఆసక్తి చూపుతున్నారు.

తెలుగులోనే కాదు ఇప్పుడు తమిళం, హిందీలోనూ హాట్‌ కేక్‌ కాబోతుంది. ఇటీవల‌ హిందీలో సంజయ్‌ లీలా భన్సాలీ సినిమాలో ఛాన్స్‌ కొట్టేసిందనే వార్తలు సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేశాయి. అందులో ఏమాత్రం వాస్తవం ఉందో తెలియదు. ఇక తమిళంలో మాత్రం భారీ ఆఫర్స్‌ ఆమెని వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇప్పటికే కార్తీ సరసన ఓ సినిమాలో నటించే అవకాశాన్ని అందుకుంది.

తాజాగా ఆమె తమిళ దళపతి విజయ్ ని బుట్టలో వేసుకుంద‌ట‌. విజయ్‌ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. స్పోర్ట్స్‌ నేపథ్యంలో రూపొందే ఈ సినిమాలో విజయ్‌ ఫుట్‌బాల్‌ కోచ్‌గా నటిస్తున్నారు. ఇందులో నయనతార కథానాయిక. ఇది విజయ్‌కి 63వ సినిమా. ఆ తర్వాత లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో విజయ్‌ ఓ ఫిల్మ్‌ చేయనున్నారు. ఇందులో హీరోయిన్‌గా రష్మికని ఫైనల్‌ చేశారట. త్వరలోనే ఆ వివరాలు వెల్ల‌డి కానున్నాయి.

Rashmika to act in tamil hero vijay movie

నిజానికి అట్లీ దర్శకత్వంలో విజయ్‌ నటిస్తున్న సినిమాలోనే రష్మిక కథానాయికగా అనుకున్నారట. కొన్ని కారణాల వ‌ల్ల ఆ స్థానంలో నయనతార వచ్చి చేరింది. అప్పుడు మిస్‌ అయినా ఇప్పుడు ల‌క్కీ ఛాన్స్ రష్మిక కొట్టేయడం విశేషం. మరోవైపు రష్మిక ప్రస్తుతం తెలుగులో ‘డియర్‌ కామ్రేడ్‌’, అల్లు అర్జున్‌, సుకుమార్‌ చిత్రంలో, ‘భీష్మ’, మహేష్‌బాబు, అనిల్‌ రావిపూడి సినిమాలో కథానాయికగా నటిస్తూ ఫుల్‌ బిజీగా ఉంది.

కన్నడలో ‘యజమన’ ఇటీవల విడుద‌ల కాగా, ‘పొగరు’ అనే మరో సినిమాలో నటిస్తుంది. అందం, దానికి మించిన అభినయం, దానికి మించిన అదృష్టం కలిసి రావడమంటే ఇదేనేమో. ఒక్క ఏడాదిలోనే టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా మారిన రష్మిక కొన్నాళ్ళపాటు తెలుగు తమిళ ఇండస్ట్రీల‌ను ఓ ఊపు ఊపుతుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.