ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన జెంటిల్‌మెన్‌లో తనలోని నెగటివ్ షేడ్‌ని చూపించి ఆడియెన్స్ చేత, సినీ వర్గాల చేత వాహ్.. అనిపించుకున్నాడు. ఇప్పుడు ఆయన మరోసారి విలన్ అవతారం ఎత్తబోతున్నాడు.
నాని..ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వతహాగా ఎదిగిన హీరో. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరోగా టర్న్ తీసుకుని ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తున్నాడు. అత్యధిక సక్సెస్ రేటుతో హీరోగా రాణిస్తున్నాడు. భలే భలే మగాడివోయ్ చిత్రం నుంచి వరుసగా విజయాలను అందుకుంటూ వస్తున్నాడు. మధ్యలో కృష్ణార్జునయుద్ధం డిజప్పాయింట్ చేసినా అది తన కెరీర్ గ్రాఫ్‌ని తగ్గించలేకపోయింది.
ఇటీవల జెర్సీ సినిమాతో కెరీర్ బెస్ట్ విజయాన్ని అందుకున్నారు. కలెక్షన్ల పరంగానూ, ప్రశంసల పరంగానూ ఈ సినిమా నాని కెరీర్‌లోనే అత్యుత్తమ చిత్రంగా నిలిచిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతేకాదు స్టార్ ఇమేజ్‌తోపాటు మార్కెట్‌ని పెంచింది. తన నటనలోని మరో కోణాన్ని ఆవిష్కరించారు. అయితే నాని హీరోగానే కాదు, విలన్‌గానూ తన సత్తా చాటుతున్నారు.
ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన జెంటిల్‌మెన్‌లో తనలోని నెగటివ్ షేడ్‌ని చూపించి ఆడియెన్స్ చేత, సినీ వర్గాల చేత వాహ్.. అనిపించుకున్నాడు. ఇప్పుడు ఆయన మరోసారి విలన్ అవతారం ఎత్తబోతున్నాడు. మరో సారి ఇంద్రగంటి దర్శకత్వంలోనే ఆయన నెగటివ్ షేడ్ ఉన్నపాత్ర పోషిస్తుండటం విశేషం.
నాని, సుధీర్‌బాబు హీరోలుగా, అదితి రావు హైదరీ, నివేదా థామస్ కథానాయికలుగా మల్టీస్టారర్ సినిమా వీ ఇటీవల ప్రారంభమైంది. దీనికి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకుడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో నాని నెగటివ్ షేడ్ పాత్రలో కనిపించనున్నారట. ఈ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని, మహాభారతంలో కర్ణుడి పాత్రని పోలి ఉంటుందని తెలుస్తుంది.
ఫ్రెండ్ షిప్ కోసం అనుకోని పరిస్థితుల్లో నాని నెగటివ్‌గా ప్రవర్తించాల్సి ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఆయన పాత్రలో ఎమోషనల్ షేడ్ కూడా ఉంటుందట. మొత్తానికి నాని విలన్‌గా మరోసారి తన విలక్షణ నటనని చూపించబోతున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం ఆయన విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో గ్యాంగ్‌లీడర్ చిత్రంలో నటిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమా ఆగస్ట్ లోనే విడుదల కానుందని టాక్. మరోవైపు శ్రీకాంత్ అడ్డాలతో ఓ సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నారట. దీన్ని గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించే అవకాశం ఉంది.