RC15 అప్‌డేట్..శంకర్, రామ్ చరణ్, థమన్ ఏం చేస్తున్నారంటే?

-

RRR సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఆయన నటించే నెక్స్ట్ ఫిల్మ్ కోసం ఈ సందర్భంగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న RC15 ఫిల్మ్ కోసం ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు.

RC 15 కు సంబంధించిన లీకులు ఇప్పటికే బోలెడు వచ్చాయి. రామ్ చరణ్ పాత్ర విభిన్నంగా ఉండబోతున్నదని తెలుస్తోంది. ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్, పొలిటీషియన్ గా రామ్ చరణ్ కనిపిస్తారని టాక్. కార్తీక్ సుబ్బరాజ్ ఈ పిక్చర్ కు స్టోరి అందించగా, శంకర్ తనదైన మార్క్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుండగా, ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్ డైరెక్టర్.

ఏపీలోని వైజాగ్ లో తాజా షెడ్యూల్ లో సీన్ల చిత్రీకరణ పూర్తయినట్లు సమాచారం. ప్రజెంట్ శంకర్ ఈ సినిమాలోని ఓ సాంగ్ కు సంబంధించిన రికార్డింగ్ పైన దృష్టి పెట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. సదరు ఫొటోలో జీనియస్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఉన్నారు. వీరు రికార్డింగ్ స్టూడియోలో ఉన్నట్లు ఫొటో చూస్తుంటే స్పష్టమవుతోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ కు జోడీగా కియారా అద్వానీ నటిస్తోంది. త్వరలో ఈ పిక్చర్ టైటిల్ రివీల్ చేస్తారని వార్తలొస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news