మొహమాటం అంటే తెలియని వ్యక్తి.. ముక్కుసూటిగా మనసులో ఏం అనిపిస్తే అది మాట్లాడటం అతని మ్యానరిజం..! అతనే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ..! ఆర్జీవీ తరచూ నాకు అమ్మాయిలు అంటే ఇష్టం అని చెబుతుంటాడు, తాను అమ్మాయిల అందాన్ని ఆస్వాదించడానికే పుట్టానని చెబుతూ ఉంటాడు. ఇక ఇదే తరహాలో ఆర్జీవీ తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు ఆ వీడియోలో ఆర్జీవీ లేడి యాంకర్ ల మధ్య జరిగిన సంభాషణ ఫన్నీగా ఉండటంతో ఆ వీడియో వైరల్ అవుతుంది.
ఆర్జీవీ తాజాగా మనస్టార్స్ అనే యూట్యూబ్ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ ఇచ్చేముందు ఆర్జీవీ తన ట్విట్టర్ లో.. నేను మనస్టార్స్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తున్నాను.. ఇంటెర్వ్యూ తీసుకునే యాంకర్ అరియానా గ్లోరి అంటే నాకు చాలా ఇష్టం తను చాలా అందంగా ఉంటుంది అని ఆర్జీవీ తన ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు. ఇక ఇవాళ ఉదయం ఆయన తన ట్విట్టర్ ఖాతా లో మరో ట్వీట్ చేశాడు ఈ ట్వీట్ లో ఆయన మాట్లాడుతూ.. అసలు సోషల్ మీడియా వాళ్ళకి హద్దులే ఉండవు చూడండి నన్ను నా యాంకర్ నల మధ్య ఏం చేశారో అంటూ ఓ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ లోని వీడియోలో యాంకర్ ఆర్జీవీని తనకు తాజాగా నచ్చిన అమ్మాయి ఎవరు..? ఎవరిని చూస్తే మీకు వావ్ అనిపించింది అని అడగగా ఆర్జీవీ నిర్మొహమాటంగా మీరే అని చెప్పారు. నాకు తాజాగా నచ్చిన లేడి మీరే అని సమాధానం ఇచ్చాడు ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతుంది.
I guess social media creative guys have no bounds ..Check what’s been done with me and my interviewer @ariyanaglory pic.twitter.com/EQKzBFkrKL
— Ram Gopal Varma (@RGVzoomin) June 26, 2020