తెలుగు ప్రేక్షకులకు రాజమౌళి.. దొరికిన బంగారం : ఆర్.ఆర్.ఆర్ పై RGV కామెంట్స్

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన మల్టీ స్టారర్ మూవీ ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమా ఈనెల 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. అయితే విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 500 కోట్ల కలెక్షన్లను రాబట్టింది ఈ సినిమా. ఇక ఈ సినిమా హిట్ కావడంతో చాలా మంది ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఆర్ఆర్ ఆర్ మూవీ తనలోని చిన్నపిల్లాడిని బయట పెట్టిందని… ఆర్జీవి చెప్పుకొచ్చారు.”నేను దేని గురించి మాట్లాడిన క్లారిటీ గా ఉంటాను. జీవితంలో తొలిసారి ఏం మాట్లాడాలో తెలియడం లేదు. తారక్ మరియు రామ్ చరణ్ ప్రతి సీన్లోనూ అదరగొట్టారు. గడిచిన 30 సంవత్సరాలలో ఏ చిత్రాన్ని ఇంత ఎంజాయ్ చేయలేదు. ప్రేక్షకులకు రాజమౌళి దొరికిన బంగారం”అంటూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు.