చరణ్ ట్రైలర్ పై ఆర్జివి కామెంట్.. గోల్డ్ విత్ డైమండ్స్..!

-

రాం చరణ్, బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన వినయ విధేయ రామ సినిమా ట్రైలర్ గురువారం సాయంత్రం రిలీజైంది. ఊర మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి రాం చరణ్ ను అదిరిపోయే రేంజ్ లో చూపించాడని ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. ఇక ఈ సినిమా ట్రైలర్ చూసిన ఆర్జివి సెన్సేషన్స్ కామెంట్స్ చేశాడు. బోయపాటి ట్రైలర్ వావ్ అనేలా ఉందని.. గోల్డ్ విత్ డైమండ్స్ అనేలా ఉందని అన్నారు.

అంతేకాదు ఈ సినిమాను హిందిలో కూడా రిలీజ్ చేయాలని చరణ్ కు జంజీర్ కాకుండా ఈ సినిమా మొదటి సినిమా అవుతుందని.. మైండ్ బ్లోయింగ్ గా చరణ్ ఉన్నాడని ట్వీట్ చేశారు వర్మ. వివి ఆర్ పై వర్మ పాజిటివ్ ట్వీట్ మెగా ఫ్యాన్స్ కు ఫుల్ ఖుషి అయ్యేలా చేస్తుంది. సంక్రాంతి కానుకగా వస్తున్న వినయ విధేయ రామ మరోసారి బాక్సాఫీస్ పై రాం చరణ్ సత్తా ఏంటో చాటేందుకు వస్తుంది. 2018లో రంగస్థలం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. మరి ఈ ఇయర్ బాక్సాఫీస్ మొనగాడు అనిపించుకున్న చరణ్ వచ్చే ఏడాది అది కొనసాగిస్తాడో లేదో చూడాలి.

https://twitter.com/RGVzoomin/status/1078354657498415105

Read more RELATED
Recommended to you

Latest news