దిమ్మతిరిగే రేంజ్ లో RRR క్లైమాక్స్….??

-

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ మూవీ పై రోజురోజుకు ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా కోసం పలువురు హాలీవుడ్ నటులను రంగంలోకి దించిన రాజమౌళి, సినిమాలోని కొన్ని కీలక సీన్స్ విషయమై ఏ మాత్రం కాంప్రమైజ్  కావడం లేదట. నిజానికి రాజమౌళి సినిమాల్లో ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ వంటి ఎపిసోడ్స్ ఎంతో అద్భుతంగా ఉంటాయి అనే విషయం తెలిసిందే.

ఆ విధంగానే ఈ ఆర్ఆర్ఆర్ సినిమా కోసం క్లైమాక్స్ ని అత్యంత భారీ ఎత్తున చిత్రీకరించనుందట సినిమా యూనిట్. ఇద్దరు హీరోలు సహా సినిమాలోని ముఖ్య పత్రాలు అన్ని పాల్గొనే ఈ క్లైమాక్స్ సీన్స్ కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారట. ఇక ఫైట్స్ మరియు యాక్షన్ సీన్స్ విషయమై ఇద్దరు హీరోల తో పాటు సినిమాలోని మిగతా క్యాస్టింగ్ కూడా కొంత శిక్షణ తీసుకున్నట్లు టాక్. అందుతున్న సమాచారాన్ని బట్టి ఇప్పటికే ఈ సినిమా క్లైమాక్స్ కోసం రామోజీ ఫిలిం సిటీలో అతి పెద్ద సెట్టింగ్ ఒకటి వేయడం జరిగిందని, జనవరి నెలాఖరులో ఆ సీన్స్ షూటింగ్ ప్రారంభం అవుతుందని అంటున్నారు.

రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తున్న ఈ సినిమాలో చరణ్ సరసన ఆలియా భట్, ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, కోలీవుడ్ నటుడు సముద్రఖని, కమెడియన్ రాహుల్ రామకృష్ణ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య ఎంతో భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా, ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాను వచ్చే ఏడాది జులై 30న వరల్డ్ వైడ్ గా పది భాషల్లో రిలీజ్ చేయనున్నారు….!!

Read more RELATED
Recommended to you

Latest news