ఉమ్మడికుటుంబాల్లో కొరవడిన ఏకాంత దాంపత్యం … ఏపీ లాస్ట్‌ ప్లేస్‌

-

చాలా మంది మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాలు, ఉమ్మ‌డి కుటుంబాల్లోనూ దాంప‌త్య జీవితాన్ని ఎంజాయ్ చేయ‌డం క‌ష్టంగా ఉంటుంది. ద‌క్షిణాది రాష్ట్రాల్లో చాలా ఇళ్ల‌ల్లోనూ, ఉమ్మ‌డి కుటుంబాలు ఉండే ఇళ్ల‌లోనూ ఇరుకు ఇళ్ల‌లోనే ఇద్ద‌రు, ముగ్గురు అన్న‌ద‌మ్ములు స‌ర్దుకుపోయి జీవిస్తుంటారు. ఇలాంటి ఇళ్ల‌ల్లో ఉండేవారికి ఎవ‌రికి అయినా పెళ్లి అయితే వారు మ‌న‌సువిప్పి ప్ర‌శాంతంగా మాట్లాడుకునే ప‌రిస్థితి కూడ ఉండ‌దు.

ఎంత మాత్రం ప్రైవ‌సీ ఉండ‌దు… ఇక ఇలాంటి కుటుంబాల్లో దాంప‌త్య జీవితం గురించి ఎంత త‌క్కువ చెప్పుకుంటే అంత మంచిది. హనీమూన్ లాంటి పదాలు తెలియని జంట‌లు కూడా కోకొల్లులుగా ఉంటాయి. ఇదే అంశంపై జాతీయ స్థాయిలో తాజాగా ఓ స‌ర్వే జ‌రిగింది. జాతీయ నమూనా సర్వే 2018 జులై – డిసెంబరు మధ్య నిర్వ‌హించిన స‌ర్వేలో ఏపీలోని గ్రామీణ ప్రాంతాల్లో 41 శాతం కుటుంబాలు కొత్తగా పెళ్లయ్యాక స‌రిగా దాంప‌త్య జీవితం అనుభ‌వించ‌లేక‌పోయార‌ని చెప్పింది.

అర్బ‌న్ ప్రాంతాల్లో వీరు 29 శాతం వరకు ఉన్నారని తెలిపింది. దీనికి తోడు ఆర్థిక ప‌రిస్థితుల నేప‌థ్యంలో కూడా చాలా మంది దంప‌తులు గుట్టు చ‌ప్పుడు కాకుండా కాపురాన్ని వెళ్ల‌దీస్తున్నార‌ని కూడా స‌ర్వే స్ప‌ష్టం చేసింది. పెళ్లి తర్వాత చ‌క్క‌టి ఏకాంతసమయాన్ని గడుపుతున్న జంటలున్న రాష్ట్రాల్లో కేర‌ళ ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉంది.

కేర‌ళ గ్రామాల్లో 89 శాతం, అర్బ‌న్ ఏరియాస్‌లో 93 శాతం మంది దాంప‌త్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ విషయంలో దేశ వ్యాప్త సగటు, సౌత్‌లోని అన్ని రాష్ట్రాల సగటు కంటే కూడా ఆంధ్రప్రదేశ్ వెనకబడి ఉండటం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news