RRR నుంచి మరో అప్‌డేట్..‘ఎత్తర జెండా’ ఫుల్ వీడియో రిలీజ్ అప్పుడే..

-

గత నెల 25న విడుదలైన విజ్యువల్ వండర్ RRR ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ సక్సెస్ అందుకుంది. ఈ పిక్చర్ తో తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడిగా రాజమౌళికి పేరు వచ్చింది. ఇక ఈ చిత్రంతో ఇద్దరు హీరోలు రామ్ చరణ్, తారక్ పాన్ ఇండియా స్టార్స్ అయిపోయారు.

ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు విశేషంగా ఆదరిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే ‘కొమ్మ ఉయ్యాల, దోస్తీ, నాటు నాటు ’ సాంగ్ ఫుల్ వీడియోలు రిలీజ్ చేసిన మేకర్స్..తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు. ఈ నెల 26న సాయంత్రం 6 గంటలకు ‘ఎత్తర జెండా’ సాంగ్ విడుదల చేయనున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఈ మేరకు వారు ఓ పోస్టర్ విడుదల చేశారు.

RRR సెలబ్రేషన్ ఆంథమ్ గా ఉన్న ఈ ‘ఎత్తర జెండా’ సాంగ్ లో దేశ భక్తులను గురించి వివరించారు. ఈ పాటలో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు ఎస్.ఎస్.రాజమౌళి.

ఆయన ఎంట్రీ కోసం ఎదరు చూస్తున్నట్లు నెటిజన్లు, సినీ అభిమానులు చెప్తున్నారు. ఇక మరి కొందరు నెటిజన్లు త్వరగా ‘కొమురం భీముడో’ సాంగ్ వీడియో విడుదల చేయాలని కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news