బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు బ్రేక్ పడింది.రెండు రోజులపాటు ప్రజా సంగ్రామ యాత్రకు బండి సంజయ్ విరామం ఇవ్వనున్నారు.ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ వడదెబ్బకు గురయ్యారు.దీంతో రెండు రోజుల పాటు పాదయాత్రకు విరామం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.ఈనెల 14వ తేదీన జోగులాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించారు బండి సంజయ్.గద్వాల జోగులాంబ జిల్లా లో ప్రస్తుతం బండి సంజయ్ యాత్ర కొనసాగుతుంది.
ఈ నెల 23వతేదీకి బండి సంజయ్ 100 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తిచేశారు.ఆదివారం నాడు బండి సంజయ్ పాదయాత్ర నర్వ -పాతర్ చేడు గ్రామాల మధ్యకు చేరుకునే సమయానికి వడదెబ్బకు గురయ్యారు సంజయ్.దీంతో బండి సంజయ్ వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ శరత్ ఆయనకు పరీక్షలు నిర్వహించాడు.వడదెబ్బకు గురైన బండి సంజయ్ ను విశ్రాంతి తీసుకోవాలని సూచించాడు.అయితే పాదయాత్రను రెండు రోజుల విశ్రాంతి తర్వాత కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు.