Ajay Devgn: టాకీసులో ఫట్..ఓటీటీలో హిట్..దూసుకుపోతున్న అజయ్ దేవగణ్ సినిమా..

-

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్..RRR సినిమాలో కీలక పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులయ్యారు. ఆయన నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘రన్ వే 34’. ఇటీవల విడుదలైన ఈ సినిమా అనుకున్న స్థాయిలో థియేటర్లలో ఆడలేదు. కానీ, ఓటీటీలో మాత్రం ఈ సినిమాకు చక్కటి ఆదరణ లభిస్తోంది.

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, రకుల్ ప్రీత్ సింగ్, ఆకాంక్ష సింగ్ కీలక పాత్రలు పోషించిన ఈ ఫిల్మ్ కు ఓటీటీ ప్లాట్ ఫామ్ OTT అమెజాన్ ప్రైమ్ వీడియో లో చక్కటి ఆదరణ లభిస్తోంది. టాప్ ప్లేస్ లో నిలిచి టాప్ 1 సినిమాగా ‘రన్ వే 34’ నిలవడం విశేషం. ‘KGF చాప్టర్ 2’, ‘సర్కారు వారి పాట’ సినిమాలను క్రాస్ చేసి ‘రన్ వే 34’ దూసుకుపోతుండటం బీ టౌన్ లో ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నది.

అజ‌య్‌దేవ్‌గ‌ణ్ హోం బ్యాన‌ర్..అజ‌య్‌దేవ్‌గ‌ణ్ ఎఫ్‌ఫిలిమ్స్‌, ప‌నోర‌మ స్టూడియోస్ నిర్మాణంలో రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ పిక్చర్ ను తెరకెక్కించారు. అమ‌ర్ మొహిలే, జ‌స్లీమ్ రాయ‌ల్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్స్. కాగా, అజయ్ దేవగణ్ ఓటీటీలో ఈ సినిమాకు విశేష ఆదరణ లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news