గుడ్ న్యూస్ : ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంది..!

సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం ప్రస్తుతం మెరుగ్గానే ఉందని ఆయన కుమారుడు చరణ్ తెలిపారు. కరోనా సోకడంతో చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాల సుబ్రహ్మణ్యం గత కొన్ని రోజులుగా విదేశీ వైద్యుల సంరక్షణలో కరోనా చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆయనకి కరోనా నెగటివ్‌ వచ్చింది. అయితే ఆ ఇన్ఫెక్షన్ కాస్త ఆయన ఊపిరితిత్తులోకి చేరడంతో ప్రస్తుతం దానికి సంబంధించిన చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగ్గానే ఉందని ఇన్‌స్టాగ్రామ్‌  వేదికగా తెలియజేశాడు ఆయన కుమారుడు చరణ్.

బాలు ఆరోగ్య పరిస్థితి మరింత నిలకడగా ఉందన్నారు. ‘నాన్న ఊపిరితిత్తులు మెరుగుపడుతున్నట్లు కనిపిస్తుందన్నారు. ఫిజియోథెరపీలో చురుకుగా పాల్గొంటున్నాడు. 20 నిమిషాల పాటు కూర్చోగలుగుతున్నాడు. త్వరలోనే ద్రవ పదార్థాలు అందించవచ్చని వైద్యులు చెప్పారు’ అని పేర్కొన్నారు.