కత్తులు ఉంటే అంతే సంగతులు..నాగచైతన్యపై సమంత సంచలన వ్యాఖ్యలు..

-

టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత , బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ తో కలిసి తాజాగా బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న సూపర్ హిట్ షో ‘కాఫీ విత్ కరణ్’కు హాజరైంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ OTTలో స్ట్రీమవుతున్న ఈ షోలో సమంత..పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పింది. ఈ క్రమంలోనే తన మాజీ భర్త నాగచైతన్యపైన సంచలన కామెంట్స్ చేసింది.

హోస్ట్ గా కరణ్ జోహార్ ప్రశ్నలు అడుగుతున్న క్రమంలో సమంత…నాగచైతన్య తన మాజీ భర్త అని చెప్పింది. ఇకపోతే ప్రస్తుతం సమంత, నాగచైతన్య మధ్య ఎటువంటి సంబంధం ఉందని అడగగా, తాము ఇద్దరం ఒకే గదిలో ఉంటే కనుక ఆ గదిలో కత్తులు ఉండకూడదని తెలిపింది. ఆ సమాధానాన్ని బట్టి వారిరువురి మధ్య కత్తులు దూసే కసి ఉందని స్పష్టమవుతోంది. సమంత, నాగచైతన్య ఇద్దరూ..డైవోర్స్ గురించి డిస్కస్ చేసుకున్న తర్వాతనే ఆ నిర్ణయానికి వచ్చారన్న విషయం సమంత మాటల ద్వారా అర్థమవుతున్నదని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

ఇక మ్యారేజెస్ గురించి తనకు ఓ అభిప్రాయం ఏర్పడానికి కరణ్ జోహార్ యే కారణమని తెలిపింది. ఆయన వెడ్డింగ్ సాంగ్స్, మ్యారేజెస్ గురించి సినిమాల్లో చూపించారని ప్రస్తావించింది. ఇక ర్యాపిడ్ ఫైర్ లో చరణ్ కు ఓ ట్యాగ్ లైన్ ఇవ్వాలని అడగగా, ‘ఓజీ’ ఇస్తానని చెప్పింది. ఓజీ అనగా ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అని తెలుస్తోంది. బన్నీకి ‘మ్యాజిక్’ అని, ధనుష్ కు ‘గ్లోబల్ స్టార్’ అని తను నటించిన కోస్టార్స్ కు ట్యాగ్స్ ఇచ్చింది సమంత.

Read more RELATED
Recommended to you

Exit mobile version