పవన్ కల్యాణ్ దర్శకత్వంపైన ప్రముఖ విలన్ ఆసక్తికర వ్యాఖ్యలు..

-

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రజెంట్ పాలిటిక్స్, మూవీస్ ..రెండూ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ కేవలం స్టార్ హీరోగానే కాకుండా సినిమా విషయంలో ఆయనకు పలు అంశాలపైన పట్టుంది. స్టోరి రైటర్ గా, డైరెక్టర్ గానూ పవన్ కల్యాణ్ వ్యవహరించారు. ఆయన స్వయంగా దర్శకత్వం వహించి హీరోగా నటించిన చిత్రం ‘జానీ’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో ఆడలేదు. కానీ, డైరెక్టర్ గా పవన్ కల్యాణ్ ఈ ఫిల్మ్ ను చక్కగా డీల్ చేశాడని ఇప్పటికి సినీ పరిశీలకులు చెప్తుంటారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ విలన్ సత్య ప్రకాశ్ పవన్ కల్యాణ్ దర్శకత్వం చేసిన కామెంట్స్ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతున్నది. అది చూసి పవన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

‘జానీ’ మూవీ కోసం పవన్ కల్యాణ్ చాలా కష్టపడ్డారని, పర్టికులర్ గా అందులో ఫైట్ సీన్ కోసం బ్రేక్ తీసుకోకుండా పవన్ పని చేశాడని విలన్ సత్య ప్రకాశ్ చెప్పారు. ఆ టైమ్ లో పవన్ కల్యాణ్ ను చూసి తాను డెడికేషన్ అంటే ఇలా ఉండాలని అనుకున్నానని చెప్పాడు.

‘జానీ’ సినిమా అప్పట్లో రావాల్సింది కాదని, అది కనుక ఇప్పుడు రిలీజ్ అయి ఉంటే డెఫినెట్ గా సూపర్ హిట్ అయ్యేదాని సత్యప్రకాశ్ చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ హండ్రెడ్ పర్సెంట్ డైరెక్టర్ గా సక్సెస్ అయ్యారని, అయితే, సినిమా జయపజయాలు మన చేతిలో లేవని సత్యప్రకాశ్ అభిప్రాయపడ్డారు. పవన్ కల్యాణ్ ప్రస్తుతం ‘హరి హర వీరమల్లు’ అనే పాన్ ఇండియా ఫిల్మ్ చేస్తున్న సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news