చిరు రాజకీయ వారసురాలు ఆమేనట.. క్రేజీ న్యూస్ వైరల్..!!

-

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ వరుస చిత్రాలను ప్రకటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇక ఈరోజు ఆయన నటించినా గాడ్ ఫాదర్ సినిమా కూడా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా దసరా సందర్భంగా ఈరోజు విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుందని చెప్పాలి ఇకపోతే ఈ చిత్రం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవి ఎన్నో విషయాలకు సమాధానాలు ఇవ్వడం జరిగింది. ఇంటర్వ్యూలో భాగంగా ఒక విలేకరి ప్రశ్న అడుగుతూ..” మీ కోడలు ఉపాసన రాజకీయాల్లో మీ వారసురాలిగా తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి మల్కాజ్గిరి స్థానంలో ఎంపీగా పోటీ చేస్తున్నారట కదా” అని అడగ్గా.. ఇందులో ఎలాంటి నిజం లేదు.. ఎవరో కావాలని ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ తెలిపిన చిరంజీవి .. రాజకీయాలలో అయితే చెప్పలేము కానీ వారు మంచి సినిమాలను తీయొచ్చు అని సమాధానంగా ఇచ్చారు. ఇక అది కేవలం ఒక రూమర్ మాత్రమే అని కూడా కొట్టి పాడేశారు.

ఇక చిరంజీవి చెప్పిన విషయాన్ని బట్టి చూస్తే ఆమె రాజకీయ రంగ ప్రవేశం చేసే ఆస్కారం లేదు . కానీ సినిమా రంగ ప్రవేశం చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు స్పష్టం అవుతున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న సినీ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఒకవేళ ఉపాసన ఇండస్ట్రీలోకి అడుగుపెడితే ఎవరి డైరెక్షన్ లో ముందుగా ఇండస్ట్రీలోకి వస్తుంది అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి కొంత మంది ఆమె తన వైద్యవృత్తిని వదిలి ఇండస్ట్రీ లోకి ఎందుకు వస్తుంది అని కూడా ప్రశ్నలు సంధిస్తున్నారు.

ఇక వైద్యరంగంలో ఉన్నత స్థానానికి చేరుకున్న ఉపాసన ఎన్నో అవార్డులను రివార్డులను కూడా సొంతం చేసుకున్నారు. అంతే కాదు ఎంతోమంది పేద ప్రజలకు అండగా నిలిచిన ఈమె కష్టం వస్తే ఆదుకోవడానికి కూడా ఎప్పుడు ముందుంటారు. ముఖ్యంగా తన ఇంట్లో పని మనిషిని కూడా అంతే గౌరవంగా చూసుకుంటూ ఉంటారు ఉపాసన.

Read more RELATED
Recommended to you

Latest news