రామ్ చరణ్ – శంకర్ సినిమా ఇక ఆగిపోయినట్టేనా..అభిమానులకు ఇది మాములు షాక్ కాదుగా!

-

RRR వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత మంచి ఊపు మీదున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి చిత్రం సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి 60 శాతం కి పైగా షూటింగ్ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి..ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని తన 50 వ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు.

- Advertisement -

అయితే ఈ సినిమాకి సంబంధించి రోజుకో వార్త బయటకి వస్తూ రామ్ చరణ్ అభిమానులను కంగారు పెడుతుంది..నిన్న మొన్నటి దాకా గ్యాప్ లేకుండా షూటింగ్ ని జరుపుకున్న ఈ చిత్రం గత కొంత కాలం నుండి తాత్కాలికంగా నిలిచిపోయింది..దానికి కారణం కమల్ హాసన్ ‘ఇండియన్ 2 ‘ చిత్రం..రెండేళ్ల క్రితం ఘనంగా ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ కొన్ని అనుకోని కారణాల వల్ల మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది..ఆ చిత్ర నిర్మాత అయితే శంకర్ ఇండియన్ 2 పూర్తి కాకముందే రామ్ చరణ్ సినిమాకి షిఫ్ట్ అయ్యాడని..దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కోర్టు లో కేసు కూడా వేసాడు.

మొత్తానికి ఈ సినిమాకి ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి నిన్ననే మళ్ళీ రెగ్యులర్ షూటింగ్ తిరిగి ప్రారంబించుకుంది..ఈ విషయాన్నీ స్వయంగా శంకర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులకు తెలియచేసాడు..ఆ ట్వీట్ వేసిన వెంటనే రామ్ చరణ్ ఫాన్స్ కామెంట్స్ సెక్షన్ లోకి వచ్చి ‘మా హీరో సినిమా పరిస్థితి ఏమిటి..మళ్ళీ షూటింగ్ ఎప్పుడు ప్రారంభిస్తారు’ అని అడగడం ప్రారంభించారు..అయితే ఇండస్ట్రీ లోని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం ఏమిటి అంటే..ఇండియన్ 2 సినిమా పూర్తి చేసేంత వరుకు రామ్ చరణ్ తో చెయ్యబొయ్యే సినిమా రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చెయ్యడట డైరెక్టర్ శంకర్..ఇండియన్ 2 సినిమాని పూర్తి చెయ్యడానికి ఇంకా 5 నెలల సమయం పడుతుందట..అప్పటి వరుకు రామ్ చరణ్ సినిమా షూటింగ్ హోల్డ్ లోనే ఉంటుందని సమాచారం..అయితే ఈలోపు ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేయించాలని దిల్ రాజు శంకర్ గారి మీద ఒత్తిడి తెస్తున్నాడట..ఈ నెలలోనే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల అవ్వబోతుంది అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.

ఇక శంకర్ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉండడం తో రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించేందుకు సిద్ధం అయిపోయాడట..జెర్సీ వంటి అద్భుతమైన సినిమాని మనకి అందించిన గౌతమ్ తిన్ననూరి తో రామ్ చరణ్ ఒక సినిమా చెయ్యబోతున్నట్టు గతం లో అధికారికంగా ప్రకటించిన సంగతి మన అందరికి తెలిసిందే..యూవీ క్రియేషన్స్ బ్యానర్ మీద ఈ సినిమా నిర్మించబోతున్నారు..ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా ఇటీవలే ప్రారంభం అయ్యాయి..ఈ వర్క్ మొత్తం పూర్తి అవ్వగానే ఈ నెలలోనే పూజ కార్యక్రమాలు నిర్వహించి వచ్చే నెల నుండి రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారట..త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకి రానున్నాయి..అంటే దీని ప్రకారం శంకర్ సినిమాకంటే ఈ సినిమానే ముందు థియేటర్స్ లో విడుదల అవ్వబోతుందా అనే సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...