సిరి – షణ్ముఖ్ జస్వంత్ ఇద్దరూ కూడా యూట్యూబ్ ద్వారా పాపులర్ అయిన వారే.. అయితే ఇద్దరికీ బిగ్ బాస్ 5 లో అవకాశం వచ్చినప్పుడు షణ్ముఖ్ రన్నర్ గా నిలిచారు. ఇక సిరి కూడా ఆడియన్స్ ను బాగా ఎంటర్టైన్ చేసింది. ముఖ్యంగా గ్లామర్ తో ప్రేక్షకులను బాగా సందడి చేసింది. బిగ్ బాస్ హౌస్ లో సిరి – షణ్ముఖ్ మధ్య కెమిస్ట్రీ కూడా ఒక రేంజ్ లో పండిందని చెప్పవచ్చు. ఇకపోతే వీరిద్దరి రొమాన్స్ గురించి సోషల్ మీడియాలో కథలుగా ప్రచారాలు జరిగాయి. అయితే తామిద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పుకొచ్చారు. ఇకపోతే ఒక దశలో సిరి వల్లే షణ్ముఖ్, దీప్తి సునయనా కూడా విడిపోయారు. ఈ విషయంలో సిరి ట్రోలింగ్ కూడా గురైంది . కానీ వీరిద్దరిని అడిగితే స్నేహితులము మాత్రమే అని చెబుతున్నారు. కానీ వీరి చేష్టలు చూస్తే ఎవరూ స్నేహితులని అనుకోరు అని చెప్పవచ్చు.
ఇకపోతే తాజాగా సిరి – షణ్ముఖ్ వ్యవహారం గురించి మరొకసారి చర్చ మొదలైంది. అందుకు కారణం హైపర్ ఆది .. నవరాత్రి సందర్భంగా మల్లెమాల సంస్థ ఈవెంట్ ను ప్లాన్ చేసింది. ఇక నవరాత్రి ధమాకా పేరుతో ప్రత్యేకమైన షో చేసి అందుకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ ఈవెంట్ కి సీనియర్ హీరోయిన్ సంఘవి , ప్రేమ కూడా ఈ అతిధులుగా వచ్చారు. ఇక హైపర్ ఆది ఎప్పటిలాగే తన కామెడీ పంచులతో విరుచుకుపడ్డాడు. ఇక ఈ క్రమంలోనే సిరి, హైపర్ ఆది కలిసి ఒక స్కిట్ పెర్ఫార్మ్ చేశారు . వీళ్లిద్దరూ తండ్రి కూతుర్లుగా నటించారు. నాన్న నాకు రెండు రోజుల నుంచి ఇంట్లోనే ఉండి బోర్ కొడుతోంది అని సిరి చెబితే.. నీకు రెండు రోజులకే బోరు కొడితే 100 రోజులు వాళ్ళని భరించే మా పరిస్థితి ఏంటి అన్నట్లుగా బిగ్ బాస్ గురించి హైపర్ ఆది పరోక్షంగా కామెంట్లు చేశారు.
కానీ సిరి అదేంటి నేను బాగా ఎంటర్టైన్ చేశానుగా అని అంటే.. ఫన్ మొత్తం షణ్ముఖ్ కే ఇచ్చావు.. మాకెక్కడ అంటూ అందరి ముందు వీళ్ళిద్దరి వ్యవహారాన్ని బయట పెట్టాడు. ఇక సిరి సిగ్గుతో నవ్వుకుంటూ ముఖాన్ని పక్కకు తిప్పుకుంది. ఇక ఇలా మరొకసారి వీరిద్దరిపై ఉన్న బంధాన్ని గురించి హైపర్ ఆది తెలియజేసే ప్రయత్నం చేశారు.