“నేను మీకు బాగా కావాల్సినవాడిని” సినిమా నుండి సాంగ్ రిలీజ్

-

“రాజావారు రాణిగారు” సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం…. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రాజావారు రాణి గారు సినిమా తర్వాత “ఎస్ ఆర్ కళ్యాణ మండపం” సినిమా చేసాడు. తాజాగా సమ్మెతమేతో టాలీవుడ్‌ ప్రేక్షకులను అలరించాడు. ఇక లెటెస్ట్‌ గా “నేను మీకు బాగా కావాల్సిన వాడిని” అంటూ డిఫరెంట్ టైటిల్తో వచ్చేసాడు కిరణ్ అబ్బవరం. ఈ సినిమా శ్రీధర్ గాదే దర్శకత్వంలో తెరకెక్కుతోంది.

ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తిరగకుతున్న ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం కు జోడిగా సంజన ఆనంద్ హీరోయిన్గా నటిస్తోంది. ఇక మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా.. కోడి రామకృష్ణ సమర్పణలో కోడి దివ్య దీప్తి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన ఆఫీషియల్ టీజర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది.

తాజాగా మేకర్స్ మరో అప్డేట్ ని ప్రకటించారు. ఈ చిత్రంలోని ” నచ్చావ్ అబ్బాయ్” అంటూ సాగే సాంగ్ ని మేకర్స్ విడుదల చేశారు. భాస్కర భట్ల రచించిన ఈ గీతాన్ని ధనుంజయ, లిప్సిక ఆలపించారు. ఈ సాంగ్ లో కిరణ్ అబ్బవరం మాస్ స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news