రెమ్యూనరేషన్‌లో నయనతార రికార్డ్​… మిగతా వాళ్లు ఎలా తీసుకుంటున్నారో తెలుసా..?

ఇటీవల ఎంతో మంది స్టార్ హీరోలు సినిమా సినిమాకి రెమ్యూనరేషన్ పెంచుతూ.. నిర్మాతలకు షాక్ ఇస్తున్నారు. ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం స్టార్ హీరోల రెమ్యునరేషన్ డబుల్ అయ్యింది. ఇకపోతే ఇటీవలి కాలంలో హీరోలు మాత్రమే కాదు కొంతమంది హీరోయిన్లు కూడా రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదేలే అంటున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ల లిస్ట్ తీస్తే అందులో మొదటి వరుసలో ఉంది నయనతార. మొత్తానికి సౌత్‌లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటీమణులగురించి ఓ ప్రత్యేక కథనం.

నయనతార: నయనతార నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంటుంది. సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్‌గా ఎదిగింది. సీనియర్ హీరోలతో పాటు కుర్ర హీరోలతో కూడా నటిస్తూ అంతకంతకు అభిమానులను సంపాదించుకుందని చెప్పాలి. ఈ క్రమంలోనే రెమ్యూనరేషన్ విషయంలో కూడా వెనక్కి తగ్గడం లేదు ఈ అమ్మడు. మిగతా హీరోయిన్లతో పోలిస్తే ఇప్పటికే టాప్ రెమ్యూనరేషన్ తీసుకుంటుంది నయనతార.

నీలేష్ డైరెక్షన్లో 75వ సినిమాగా రూపొందుతున్న మూవీకి నయనతార ఏకంగా రూ.10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ఒక వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఈ క్రమంలోనే దక్షిణాదిలో ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకోబోతున్న మొట్ట మొదటి హీరోయిన్​గా నయనతార రికార్డు సృష్టించబోతుందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

సమంత: సౌత్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది సమంత. సాధారణంగా హీరోయిన్లు ఏజ్ పెరుగుతున్న కొద్ది ఫెయిడ్ అవుట్ అవుతారు. కానీ సమంత మాత్రం అంతకంతకూ ఇమేజ్ పెంచుకుంటూనే ఉంది. దానితో పాటు రెమ్యూనరేషన్ కూడా పెంచేస్తోంది. ఇంతకు ముందు వరకు సామ్… సినిమాకు 2 నుంచి 3 కోట్ల వరకూ తీసుకునేది.. పుష్ప-1, ఫ్యామిలీమ్యాన్​తో వచ్చిన క్రేజ్​తో… నార్త్‌లోనూ జోరు పెంచేసింది. ఇప్పుడు తన రెమ్యూనరేషన్ ఒక్కో చిత్రానికి రూ.3 నుంచి రూ.5 కోట్లకు పెంచినట్టు సమాచారం. ప్రస్తుతం గుణశేఖర్ శాకుంతలం, యశోద మూవీలో నటిస్తోంది.

పూజా హెగ్డే: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం జనగణమన. ఈ చిత్రంలో విజయ్‌ సరసన పూజా హెగ్డే నటించనుంది. ఈ చిత్రానికి ఈ పొడుగుకాళ్ల సుందరి భారీగా పారితోషికం తీసుకుంటోందని సమాచారం. ఆమె గతంలో ఒక చిత్రానికి రూ. 3 కోట్లు నుంచి రూ. 4 కోట్లు వసూలు చేసేది. ఇప్పుడు తన రెమ్యూనరేషన్‌ను రూ. 5 కోట్లకు పెంచినట్లు తెలుస్తోంది.

రకుల్ ప్రీత్ సింగ్‌: ఇటీవల రన్‌వే 34లో అజయ్ దేవగన్ , బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌లతో కలిసి నటించింది రకుల్‌ ప్రీత్ సింగ్. ఈ చిత్రంలో తన పాత్ర కోసం నటి రూ. 3.5 కోట్లు వసూలు చేసింది.

Tamannaah photos

తమన్నా భాటియా..: బాహుబలి తర్వాత తమన్నా తన రెమ్యూనరేషన్‌ను పెంచేసింది. ప్రస్తుతం 3 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుంది. ఈ ఏడాది 75వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరైన ఈ నటి.. తన అందాలతో మైమరిచేలా సందడి చేసింది.
రష్మిక మందన్న: పుష్ప: ది రైజ్ సక్సెస్‌తో సౌత్, నార్త్… అంతటా క్రష్‌గా మారిపోయింది రష్మిక. అందుకే తనను నేషనల్ క్రష్‌గా పిలుస్తున్నారు. పుష్ప తర్వాత తన రెమ్యూనరేషన్ పెంచేసింది ఈ అమ్మడు. ఒక్కొ చిత్రానికి ప్రస్తుతం రూ.3 కోట్లు వసూలు చేస్తోంది.

అనుష్క శెట్టి: బాహుబలి తర్వాత అనుష్క కూడా ఫీజు పెంచేసింది. ప్రస్తుతం ప్రతి చిత్రానికి సుమారుగా రూ. 4 కోట్లు తీసుకుంటుంది.

కాజల్ అగర్వాల్: గౌతమ్ కిచ్లూతో వివాహం, ఓ బాబు పుట్టిన తర్వాత కాజల్ అగర్వాల్… ఆచి తూచి సినిమాలు చేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం తన రెమ్యూనరేషన్ రూ. 2 కోట్లు.

శృతి హాసన్: అత్యధికంగా చెల్లించే సౌత్ హీరోయిన్స్‌లో శృతి హాసన్ ఒకరు. ఆమె ఒక్కో సినిమాకు దాదాపుగా రూ. 2 కోట్ల పారితోషికం తీసుకుంటుంది.

కీర్తి సురేష్: కీర్తి సురేష్ ఇటీవల మహేష్ బాబుతో కలిసి సర్కార్ వారి పాట చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో తన నటనకుగాను విమర్శకులు, ప్రేక్షకుల నుంచి ప్రశంసలు సైతం అందుకుంది. ఇప్పుడు ఆమె చేతిలో ఆసక్తికర ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ప్రస్తుతం కీర్తి సురేశ్ ఒక్కో సినిమాకు 2 కోట్లు వసూలు చేస్తోంది.