ఎస్పీ బాలుకు ఈ సినిమా క్లైమాక్స్ అత్యంత ఇష్టం..

-

లెజెండరీ సింగర్ ఎస్పీ బాలు.. భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన పాటల రూపంలో మనతోనే ఉన్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎంతో మంది హీరోలకు గాత్రం ఇచ్చిన ఎస్పీ బాలు..కు ఓ సినిమా క్లైమాక్స్ అంటే చాలా ఇష్టం. స్వయంగా ఆయనే ఓ ఇంటర్వ్యూలో ఆ చిత్రం గురించి తెలిపారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

SP Balasubrahmanyam | SP Balu: Remembering the actor, playback singing icon  on his 75th birth anniversary

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన భక్తిరస చిత్రం ‘అన్నమయ్య’ క్లైమాక్స్ అంటే తనకు చాలా ఇష్టమని బాలు చెప్పారు. ఆ సీన్ ను తాను చాలా సార్లు చూశానని పేర్కొన్నారు. భగవంతుడు వచ్చి భక్తుడు పాడిన పాటను పాడి మళ్లీ వినిపించడం చాలా గొప్ప ఊహని వివరించారు. అక్కినేని నాగార్జున నటించిన ఆ చిత్రం బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ అయింది.

అప్పటి వరకు కమర్షియల్ సినిమాలు తీసినప్పటికీ ఆ సినిమాతో రాఘవేంద్రరావు తన పంథా మార్చుకున్నారు. భక్తి మార్గంలో పయనించినట్లు ఆ సినిమాను అత్యద్భుతంగా తీశారని ప్రతీ ఒక్కరు ప్రశంసించారు. ఆ ఫిల్మ్ టీవీల్లో వచ్చినా ఇప్పటికి జనాలు అతుక్కుపోయి మరీ చూసేస్తుంటారు.

‘అన్నమయ్య’ చిత్రంలోని పాటలన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. నాగార్జున ‘అన్నమయ్య’గా జీవించేశాడు. అప్పటి వరకు సూపర్ స్టైలిష్ గా కనిపించిన నాగార్జున ఆ చిత్రం ద్వారా తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించారు. ఎం.ఎం.కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు. రమ్యకృష్ణ, కస్తూరి కథానాయికలుగా నటించగా, వెంకటేశ్వరుడి పాత్రను సుమన్ పోషించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news