రాకింగ్ రాకేశ్ ఫుల్ హ్యాపీ..ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చిన జోర్దార్ సుజాత

-

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన యాంకర్..సుజాత అని చెప్పొచ్చు. అయితే, ఈమె పేరు సుజాత అని చెప్పడం కంటే కూడా ‘‘జోర్దార్ సుజాత’’ అని చెప్తేనే జనాలు తొందరగా గుర్తిస్తారు. అలా తెలుగు వారికి సుపరిచితమైన యాంకర్ జోర్దార్ సుజాత. ఈ మె పాపులర్ తెలుగు రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసి తన పాపులారిటీని ఇంకా పెంచేసుకుంది.

 

 

జోర్దార్ సుజాత..‘‘సూపర్‌ సుజాత’’ అనే యూట్యూబ్‌ చానల్‌ ద్వారా నిత్యం అందరికీ టచ్ లో ఉంటుంది. ఈమె ‘జబర్దస్త్‌’ కమెడియన్‌ రాకింగ్‌ రాకేశ్‌తో ప్రేమలో ఉందని చాలా కాలం నుంచి ప్రచారంలో ఉంది. కాగా, సుజాత మాత్రం తన ఆత్మీయుడని చెప్తుంటుంది. తాజాగా తన ప్రియుడు రాకింగ్ రాకేశ్ కు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చింది సుజాత. ఇందుకు సంబంధించిన వీడియోను తన యూట్యూబ్‌ చానల్‌లో షేర్ చేసింది సుజాత.

తన ఆత్మీయుడు, స్నేహితుడు అంతకు మించి అయిన రాకేశ్ కు ఫోన్ కొనిస్తున్నట్లు తెలిపింది సుజాత. గత కొద్ది రోజుల నుంచి ఫోన్ విషయమై రాకేశ్ ఇబ్బంది పడుతున్నాడని, ఈ నేపథ్యంలో తాను అతడి మనసుకు దగ్గరైన వ్యక్తిని కాబట్టి తాను ఫోన్ ఇచ్చానని చెప్పింది.

తాను ఇచ్చిన ఆ ఫోన్ పగులగొట్టడానికి రాకేశ్ సందేహిస్తాడని చెప్పింది. ఇక తన ప్రతీ విజయంలో రాకేశ్ ఉన్నాడని, అందుకే తాను ఫోన్ గిఫ్ట్ గా ఇస్తున్నానని సుజాత పేర్కొంది. అలా సుజాత రాకింగ్ రాకేశ్ కు సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్ 22 అల్ట్రా ఫోన్‌తో పాటు స్మార్ట్‌ వాచ్‌ ఇచ్చింది. వీటి ఖరీదు రూ.1,20,000 కాగా, వీటిని తనకోసమే కొన్నానని సుజాత చెప్పడంతో రాకింగ్ రాకేశ్ ఎమోషనల్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో యూట్యూబ్ లో వైరలవుతోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news