రాహుల్ గాంధీ పబ్ వ్యవహారం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధం చెలరేగుతోంది. తాజాగా బీజేపీ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు రియాక్ట్ అవుతున్నారు. బీజేపీ పార్టీపై కాంగ్రెస్ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ వ్యక్తిత్వం దెబ్బతీసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని విమర్శించారు. పాత వీడియోలను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ నీచమైన రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ మంత్రులు, ఎంపీల పబ్ ల వీడియోలు మా దగ్గర ఉన్నాయని త్వరలో బయటపెడుతాం అని హెచ్చిరించారు. రాహుల్ నాయకత్వం కోసం యువత ఎదురుచూస్తోందని మధుయాష్కీ అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలపై ప్రజల తిరుగుబాటు మొదలవుతోందని ఆయన అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ నేతలు నోరుమూసుకుంటే మంచిది లేకుంటే మీ బండారం బయటపెడుతాం అని మధుయాష్కీ హెచ్చిరించారు.