నందమూరి బాలకృష్ణ చేతిలో సునీల్ కెరీర్ ? 

-

టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించిన సునీల్ అప్పట్లో ఇండస్ట్రీలోనే బిజీ కమెడియన్ గా మారాడు. అయితే ఆ తర్వాత హీరోగా ట్రై చేసి సినిమాలు చేసి విఫలం కావడంతో మళ్లీ సునీల్ ఇప్పుడు రెండో ఇన్నింగ్స్ కమెడియన్ గా స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పటికే చాలా సినిమాల్లో నటించినప్పటికీ గతంలో మాదిరిగా అప్పట్లో ఉన్న కమెడియన్ టైపు సునీల్ రాణించలేక పోతున్నారు.

Image result for balakrishna sunil

స్నేహితుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రెండు సినిమాలలో చేసినా గాని పెద్దగా ప్రయోజనం ఏమీ లేకుండా పోయింది. ఇదే తరుణంలో మాస్ మహారాజా రవితేజ డిస్కో రాజా సినిమాల్లో కూడా నటించిన గాని సునీల్ నటనకు పెద్దగా మార్పులు కూడా లేదు. అంతేకాకుండా డిస్కోరాజా దారుణంగా ఫ్లాప్ అయ్యింది.

ఇటువంటి తరుణంలో సునీల్ కెరీర్ నందమూరి బాలకృష్ణ చేతిలో పడినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినపడుతున్నాయి. విషయమేమిటంటే బోయపాటి దర్శకత్వంలో బాలయ్య బాబు మూడో సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమాలో బాలకృష్ణ కి సపోర్టింగ్ క్యారెక్టర్ లో సునీల్ ని నటింపజేయడానికి డైరెక్టర్ బోయపాటి ఆలోచిస్తున్నట్లు వార్తలు ఇండస్ట్రీలో వినబడుతున్నాయి. 

Read more RELATED
Recommended to you

Latest news