మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి రిలీజ్‌కు ముందే రికార్డుల దుమ్ము రేపుతోంది. ఇక రు.280 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కినట్టు చెపుతోన్న ఈ సినిమా ఫస్ట్ డే ఎంత షేర్ రాబడుతుందన్న అంచనాలు వెలువడుతున్నాయి. సైరా తొలి రోజు దక్షిణాదిలో రూ. 30 కోట్లు రాబట్టే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే టైంలో హృతిక్‌రోషన్ వార్ సినిమాకు సైతం ఫస్ట్ డే రు. 45 కోట్ల వరకు షేర్ రాబట్ట వచ్చని అంటున్నారు.
వాస్తవంగా నెల రోజుల క్రితం రిలీజ్ అయిన సాహోతో పోలిస్తే సైరాపై క్రేజ్ తక్కువగానే ఉంది. ఆన్‌లైన్ బుకింగ్స్ సైతం తక్కువగానే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సైరా సౌత్‌లో రు.30 కోట్ల షేర్ రాబడుతుందని ట్రేడ్ విశ్లేషకులు చెపుతున్నారు. సౌత్‌కు వచ్చే సరికి మెగాస్టార్ సూపర్ హీరో అయినా బాలీవుడ్‌లో మాత్రం వార్ పై చేయి సాధిస్తుందని… ఈ సినిమా అక్కడ తొలి రోజు రు.45 కోట్లు కొల్లగొడుతుందని లెక్కలు వేస్తున్నారు.
ఇక బాలీవుడ్‌లో సైరా వర్సెస్ వార్ అడ్వాన్స్ బుకింగ్‌లు చూస్తే వార్ సినిమా అడ్వాన్స్ బుకింగ్ టికెట్ల అమ్మకాలు బాగున్నాయంటున్నారు. వార్‌కు ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్‌ల ద్వారా రూ. 25 కోట్లు వచ్చాయని వెల్లడించారు. సినిమా బాగుందని టాక్ వస్తే ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ సినిమా అడ్వాన్స్ బుకింగ్ రికార్డు(రూ.27.5 కోట్లు)ను వార్ అధిగమిస్తుందంటున్నారు.