‘సైరా ‘ టీజ‌ర్‌ : క‌ళ్లు చెదిరే యాక్ష‌న్‌..చ‌రిత్ర మ‌ర‌చిన తెలుగు వీరుడు

-


మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. చిరంజీవి త‌న‌యుడు రామ్ చ‌ర‌న్ స్వ‌యంగా త‌న సొంత బ్యాన‌ర్ అయిన కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీపై దాదాపు రూ.200 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ ఒక టీజర్‌తో పాటు, మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ నేప‌థ్యంలోనే మ‌రో టీజ‌ర్‌ను మంగ‌ళ‌వారం ముంబైలో రిలీజ్ చేశారు. 1.47 నిమిషాల పాటు ఉన్న టీజ‌ర్ దుమ్ము రేపుతోంది. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వాయిస్ ఓవ‌ర్‌తో ఈ టీజ‌ర్ స్టార్ట్ అవుతుంది. రేనాటి సూర్యుడు అంటూ ప‌వ‌న్ న‌ర‌సింహారెడ్డి గురించి ఇంట్ర‌డ‌క్ష‌న్ ఇస్తాడు.

భారీ యాక్షన్‌ విజువల్స్‌లో రూపొందించిన ఈ టీజర్‌ సినిమా మీద అంచనాలను భారీగా పెంచేస్తోంది. పవన్‌ వాయిస్‌తో ప్రారంభమైన టీజర్‌, భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌తో వావ్‌ అనిపించేలా డిజైన్‌ చేశారు. ఇక టీజ‌ర్‌లో సినిమా కోసం ప‌ని చేస్తోన్న వారంద‌రిని చూపించారు. మెగాస్టార్‌ సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, సుధీప్‌, విజయ్‌ సేతుపతి, జగపతి బాబు, రవికిషన్‌, తమన్నాలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమా చిరు డ్రీమ్‌ ప్రాజెక్ట్ కూడా కావటంతో రామ్‌ చరణ్‌ దగ్గరుండి సినిమా పనులన్ని చూసుకుంటున్నాడు. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news