తమన్నా “గుర్తుందా శీతాకాలం” మూవీ రిలీజ్ వాయిదా !

-

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ఇటీవల ‘గాడ్సే’గా..తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. త్వరలో సత్యదేవ్ నటించిన లవ్ స్టోరి ‘గుర్తుందా శీతాకాలం’ విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టకుంటున్నాయి. శాండల్ వుడ్(కన్నడ) సూపర్ హిట్ ఫిల్మ్ ‘లవ్ మాక్ టైల్’ ఆధారంగా తెరకెక్కుతున్న ‘గుర్తుందా శీతాకాలం’..డెఫినెట్ గా తెలుగులో హిట్ అవుతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఇందులో సత్యదేవ్, తమన్నా భాటియాల రొమాన్స్ సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని టాక్. ఇప్పటికే చాలా సార్లు విడుదల తేదీలను ప్రకటించి వాయిదా వేసిన మేకర్స్ తాజాగా..ఈ సినిమాను సెప్టెంబర్ 9 వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ సెప్టెంబర్ 23వ తేదీకి వాయిదా వేస్తూ తాజాగా ఒక పోస్టర్ ను వదిలారు. భావన రవి – చింతపల్లి రామారావు నిర్మించిన ఈ సినిమాకి కాలభైరవ సంగీతాన్ని అందించాడు. నాగ శేఖర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.

Read more RELATED
Recommended to you

Latest news