విజయ్ ట్రెండ్ సెట్టర్..వరుస అప్‌డేట్స్‌తో ఫ్యాన్స్ హ్యాపీ

-

కోలీవుడ్ స్టార్ ఇళయ తలపతి విజయ్ ..ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. సోషల్ మీడియాలో నెటిజన్లు, సినీ అభిమానులు విజయ్ సూపర్ స్టార్ అని తెగ పొగిడేస్తున్నారు. విజయ్ బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమా నుంచి మేకర్స్ వరుస అప్ డేట్స్ ఇచ్చేశారు. దాంతో విజయ్ అశేష అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

విజయ్ ప్రస్తుతం..టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ బ్యానర్స్ పై ఓ చిత్రం చేస్తున్నాడు. దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా ఈ పిక్చర్ ను ప్రొడ్యూస్ చేస్తున్నారు. తెలుగులో ‘వారసుడు’, తమిళ్‌లో ‘వారిసు’ (Varisu) అనే టైటిల్స్‌ని ఈ సినిమాకు ఫిక్స్ చేశారు. ‘ది బాస్ రిటర్న్స్’ అనేది ట్యాగ్‌లైన్‌తో.. పూర్తిస్థాయిలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌‌గా ఈ చిత్రం రూపొందుతోంది.

ఈ ఫిల్మ్ టైటిల్‌తో పాటు విజయ్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఆ వెంటనే సెకండ్ లుక్, థర్డ్ లుక్ కూడా విడుదల చేసి.. ‘వారసుడు’ టైటిల్‌‌ ట్రెండ్ అయ్యేలా చేశారు. అలా ‘వారసుడు’ సినిమాతో విజయ్ ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తారని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అల్ట్రా స్టైలిష్ లుక్ లో …విజయ్ అదరగొడుతాడని అంటున్నారు. భారీ తారగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news