RRR పై విమర్శలు చేసి ఇప్పుడు బుద్ది తెచ్చుకున్న సెలబ్రిటీ..!!

-

రీసెంట్ గా లాస్ ఏంజెల్స్ లో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఫంక్షన్ లో  బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ‘నాటు నాటు’ సాంగ్ కు గానూ ఆర్ ఆర్ ఆర్ మూవీ  గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ సాధించింన  సంగతి అందరికీ తెలిసిందే. దీనితో దేశం మొత్తం ఆర్ ఆర్ ఆర్ మూవీ మేనియా తో ఊగిపోయింది. ఇప్పుడు నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు రేసులో షార్ట్ లిస్ట్ కు ఎంపిక అయ్యింది.

దానితో అందరూ RRR టీమ్ కు అందరూ అభినందనలు తెలుపుతున్నారు. ప్రపంచంలో ప్రతిష్టాతకంగా భావించే ఆస్కార్ అవార్డుల్లో RRR అవార్డు తెస్తుందని భావిస్తున్నారు. దాని కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే గతంలో ఈ సినిమా పై అవాకులు చవాకులు పేలిన వారు కూడా ఇప్పుడు తమ తప్పు తెలుసుకొని అభినందనలు తెలుపుతున్నారు అదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది.Oscar Winner working for Pushpa movie

గతంలో స్లమ్ డాగ్ మిలియనీర్’ సినిమాకు గానూ ఉత్తమ సౌండ్ మిక్సింగ్ విభాగంలో రెసూల్ పూకుట్టి అవార్డు అందుకున్న  సౌండ్ డిజైనర్ గతంలో ‘RRR’పై రెసూల్ పూకుట్టి ఈ సినిమా గురించి ఇది ఇద్దరి మగ ప్రేమికుల కథ అంటూ విమర్శించారు. అప్పట్లో దీనికి తగ్గట్టగానే సంగీత దర్శకుడు కీరవాణి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు ఆయనే కీరవాణి గారికి అభినందనలు తెలుపుతూ పోస్ట్ పెట్టారు. కీరవాణి గారు కూడా పాత విషయాలు మరచి పోయి హుందాగా థాంక్యూ చెప్పారు, అదీ సంగతి.

Read more RELATED
Recommended to you

Latest news