‘నాటు నాటు’ అంటూ మాస్ స్టెప్పులేస్తున్న ‘ఓరి దేవుడా’ హీరోయిన్స్.. వీడియో వైరల్..!

-

ఆర్ ఆర్ ఆర్ మూవీ ఇండియాలో విడుదలయి సుమారుగా ఏడు నెలలు కావస్తున్నా.. ఇప్పటికీ ఈ సినిమాపై క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఈ సినిమాకు జనాలు ఎంతలా కనెక్ట్ అయ్యారు అంటే ఇప్పటికీ కూడా ఈ సినిమాలోని పాటలకు మాస్ స్టెప్పులేస్తూ ఇరగదీస్తున్నారు ఇటీవల ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి రాగా మరొకవైపు జపాన్ భాషలో కూడా తాజాగా విడుదలై అక్కడ కలెక్షన్లు సునామీ సృష్టిస్తోంది.. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శక ధీరుడు రాజమౌళి , కార్తికేయ దంపతులు అందరూ కూడా జపాన్లో టోక్యో వీధుల్లో సందడి చేశారు. ఇదే కాదు వీరంతా కూడా తమ ఫ్యామిలీతో కలిసి జపాన్ లోని టోక్యో వీధిలో రోడ్డు దాటుతూ దోస్తీ పాటకు స్టెప్పులు వేశారు.

అలాగే జపనీయులతో కలిసి వీరంతా ఆర్ఆర్ఆర్ ప్రీమియర్ షో ని కూడా తిలకించారు. ఈ క్రమంలోని ఈ సినిమాకు జపాన్లో భారీగా కలెక్షన్లు వస్తున్నాయి.. ఇదిలా ఉండగా ఆర్ఆర్ఆర్ సినిమాలోని సిగ్నేచర్ స్టెప్పులకు ఇద్దరు ముద్దుగుమ్మలు డాన్స్ చేయగా అది కాస్త నెట్టింట చాలా వైరల్ గా మారుతోంది. తాజాగా ఓరి దేవుడా సినిమా సక్సెస్ సంబరాల్లో భాగంగా ఆ సినిమా హీరోయిన్స్ ఆశా భట్, మిథాలా పాల్కర్ దీపావళి కాంతుల్లో నాటు నాటు పాటకు స్వింగ్ స్టెప్పులు వేసి ఉత్సాహంగా రీ క్రియేట్ చేశారు. తాజాగా ఈ వీడియోను మిథాలా పాల్కర్ తన అధికారిక ఇంస్టాగ్రామ్ వేదికగా అప్లోడ్ చేసింది కింద ఈ వీడియోకు “Naatu Naatu with my partner -in – crime! Because..how could We not..”అనే కామెంట్ తో పాటు లవ్ సింబల్ ఎమోజిని కూడా షేర్ చేసింది.

అక్టోబర్ 21వ తేదీన విడుదలైన ఓరి దేవుడా సినిమా మొదటి రోజు మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీపావళి సెలవులు రావడంతో ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వస్తున్నాయి. ఇందులో హీరో గా విశ్వక్ సేన్ హీరోగా నటించగా.. వెంకటేష్ కీలక పాత్రలో నటించి మెప్పించారు.

 

View this post on Instagram

 

A post shared by Mithila Palkar (@mipalkarofficial)

Read more RELATED
Recommended to you

Latest news