జీవితంలో చేయకూడదనుకున్న తప్పును.. శ్రీదేవి మళ్ళీ చేయడానికి కారణం..?

-

అతిలోక సుందరి అందాల తార శ్రీదేవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మన మధ్య లేకపోయినా ఒక్కసారైనా కనిపిస్తే బాగుండు అని అనిపించే అంత పిచ్చి ప్రేమ జనాలది. ఎప్పటికీ యువతకు డ్రీమ్ గర్ల్ శ్రీదేవి అని చెప్పడంలో సందేహం లేదు. ఒక అభిమానులే కాదు సినీ సెలబ్రిటీలు పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా ఒక్కసారైనా శ్రీదేవితో నటించే అవకాశం వస్తుందా? అని ఎదురుచూసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అందుకే తండ్రి కొడుకులకు కూడా ఈమె హీరోయిన్గా మారి ఆ ఘనతను దక్కించుకుంది.

అంతేకాదు పెళ్లి చేసుకొని ఆమె ఎక్కడ సినిమాలు మానేస్తుందో అని కొన్ని సంవత్సరాలు యువత కూడా బాధపడేవారు. ఇక బోనీకపూర్ తో కమిట్ అయిన తర్వాత చాలామంది నిరాశ వ్యక్తం చేశారు. అందుకే శ్రీదేవి కోసం పడి చచ్చిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారని చెప్పవచ్చు. అయితే శ్రీదేవి మాత్రం తన కెరియర్ బాగా ఉన్నప్పుడే రెండో పెళ్లి వాడిని చేసుకోకూడదని అనుకునేదట. అందుకు ముఖ్య కారణం ఆమె తల్లి రాజేశ్వరి అని తెలుస్తోంది. తన తండ్రి అయ్యప్ప శర్మకు తల్లి రాజేశ్వరి సమాజం ఒప్పుకోని భార్య కాబట్టి పెళ్లి విషయంలో ఆమె ఇలాంటి ఒక రూల్ పెట్టుకుందని సమాచారం.

అందుకే సినిమాల్లో నటిస్తున్నప్పుడు చాలామంది హీరోలను ఈ ఒక్క కారణంతోనే రిజెక్ట్ చేసింది శ్రీదేవి. పెళ్లి విషయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. మొదట మిథున్ చక్రవర్తితో ప్రేమ వివాహం అందరికీ తెలిసిందే. అతడి భార్య ఉండడంతో అతడికి దూరం అయింది. తెలుగు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు శ్రీదేవి తల్లి రాజేశ్వరి తన కూతురికి ఎక్కడ పెళ్లి కాకుండా మిగిలిపోతుందో అని ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా అని అడిగేవారట.కానీ చివరికి తల్లి మరణించిన తర్వాత మిథున్ చక్రవర్తితో విడిపోయి.. బోనీ కపూర్ తో ప్రెగ్నెన్సీ తెచ్చుకొని గత్యంతరం లేక అప్పటికే వివాహమైనా పెళ్లి చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version