సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన సినిమాల సందడి ముగియడంతో ఈ వారం పలు క్రేజీ సినిమాలు థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇకపోతే సంక్రాంతి సినిమాలను ఇప్పటికే చూసేసిన ప్రేక్షకులు మరొకవైపు కొత్త సినిమాలు చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక మరి కొంతమంది సంక్రాంతి పండుగకు విడుదలైన చిత్రాలను థియేటర్లో చూడని వారు ఓటీటీ ల కోసం ఎదురుచూస్తున్నారు. మరి ఈ వారం ఓటీటీ థియేటర్లలో సందడి చేయనున్న సినిమాల గురించి చూద్దాం..
ఇక ఈవారం థియేటర్లలో విడుదల కాబోతున్న సినిమాల విషయానికి వస్తే.. సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న చిత్రం పఠాన్.. ఈ సినిమా జనవరి 25వ తారీకు థియేటర్లలో విడుదల కాబోతోంది. మరొకవైపు సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన హంట్ సినిమా కూడా జనవరి 26వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. గాంధీ గాడ్సే ఏక్ యుధ్ మూవీ ఈనెల 26వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది ముఖ్యంగా సింధూరం , అయ్యప్ప… భక్తుల కోసం ఈ 2 సినిమాలు కూడా థియేటర్లలో రిలీజ్ కానున్నాయి.
మరి ఓటీటీ సినిమాల విషయానికి వస్తే ఈనెల 27వ తేదీ నుంచి ఆహా ఓటీటీ లో నిఖిల్ 18 పేజీస్ సినిమా స్ట్రీమింగ్ కానుంది. అలాగే నెట్ఫ్లిక్స్ లో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని సమాచారం. మరోవైపు అమెజాన్ ప్రైమ్ లో ఎంగ్గా హాస్టల్ అనే తమిళ్ మూవీ కూడా స్ట్రీమింగ్ కానుంది. మొత్తానికైతే ఈ శుక్రవారం ఈ సినిమాలు అటు థియేటర్లలో ఇటు ఓటీటీ లలో కూడా సందడి చేయనున్నాయి.