నందమూరి బాలకృష్ణ లేటస్ట్ మూవీ అఖండ..విజయవంతంగా దూసుకెళ్తోంది. సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాపై ముందునుంచే ప్రేక్షకుల్లో అంచానాలు భారీ స్థాయిలో ఉన్నాయి. సినిమా రిలీజై వారి అంచనాలను అందుకుంది. బాలకృష్ణ సినిమా అంటేనే కుర్రకారుకు ఓ జోష్. బాలకృష్ణకు అందరి సినిమాల హిరోలు ఫ్యాన్స్ ఉంటారు. ఎంతైనా బాలయ్య ట్రెండే వేరయ్యా. ఇతర హిరోల సినిమాలకు వెళ్లే జై బాలయ్య అంటూ కేరింతలు కొడతారు..అలాంటిది ఇక బాలకృష్ణ మూవికి థియటర్లు దద్దరిల్లేలా అరవాల్సిందే కదా.. ఇప్పటికే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 26-28 కోట్ల వరకూ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక USలో అయితే.. ఇప్పటి వరకు 700K డాలర్స్ వసూళ్లను రాబట్టుకుని రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాలో బాలకృష్ణ, ప్రగ్యా జైశ్వాల్ హీరో హీరోయిన్లుగా నటిస్తే శ్రీకాంత్, పూర్ణ, జగపతిబాబు తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. అయితే వీరితో పాటు ఈ సినిమాలో రెండు గిత్తలు కీలకంగా కనిపిస్తాయి. రాయలసీమ పాత్రధారి మురళీకృష్ణగా నటించిన బాలకృష్ణ పెంపుడు గిత్తలుగా కనిపించిన ఇవి.. హీరో ఇంట్రడక్షన్, క్లైమాక్స్ సీన్స్, యాక్షన్ సన్నివేశాల్లో బాగా ఆకట్టుకున్నాయి.
సినిమా చూసిన అందరికి అసలు ఈ గిత్తలు ఎవరివి? అని సందేహం రావచ్చు. చౌటుప్ప ల్ మండలం లక్కారం గ్రామానికి చెందిన నూనె శ్రీనివాస్ వి ఇవి. ఇతను స్థానికంగా తన వ్యవసాయ క్షేత్రంలో గోశాలను ఏర్పాటు చేశాడు. ప్రత్యేకమైన ఆవులు, కోడెలను పెంచుకుంటున్నాడు. అందులో భాగంగానే రెండేళ్ల క్రితం కొనుగోలు చేసిన కోడెలకు కృష్ణుడు, అర్జునుడు అనే పేర్లు పెట్టాడు. నిత్యం వాటికి వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చాడు. పేరు పెట్టి పిలిస్తే పలికేలా, చెప్పిన మాట వినేలా ఈ గిత్తలను తయారు చేశాడు.
ఈ క్రమంలో సొంత పని నిమిత్తం శ్రీనివాస్ గతేడాది రామోజీ ఫిలింసిటీకి వెళ్లాడు. అక్కడ షూటింగ్ జరుగుతుండడంతో ఎద్దుల చర్చ వచ్చింది. దాంతో తన కోడెలకు సంబంధించిన వీడియోలు వాళ్లకు చూపించాడు. కోడెల నైపుణ్యం నచ్చిన నిర్వాహకులు షూటింగ్‌కు ఆహ్వానించారు. ఆ మేరకు ఏడాది క్రితం రామోజీ ఫిలింసిటీలో రెండ్రోజుల పాటు కోడెలు షూటింగ్‌లో పాల్గొన్నాయి. చిత్రంలోని ప్రారంభ సన్నివేశంతో పాటు క్లైమాక్స్ సన్నివేశంలో ఇవి కన్పిస్తాయి. మూగజీవాలైనప్పటికీ సినిమా షూటింగ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి ఆకట్టుకున్నాయి. ప్రముఖ హీరోతో కలిసి ప్రధానమైన సినిమాలో తన కోడెలు నటించడం, చక్కటి గుర్తింపు రావడం ఆనందంగా ఉందని శ్రీనివాస్ తెలిపాడు.