మాస్ ఇమేజ్ కోసం పాకులాడుతున్న టాలీవుడ్ హీరోస్..!!

-

ఇటీవల కాలంలో చాలా మంది హీరోలు ఎక్కువ కాలం కొనసాగాలి అంటే మాస్ ఇమేజ్ ముఖ్యము అన్న సంగతి బాగా తెలుసుకున్నారు. అందుకే క్లాస్ సినిమాలకు మాత్రమే పరిమితం కాకుండా మాస్ ఇమేజ్ ను సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. చాక్లెట్ బాయ్ రామ్ కూడా మొన్నటివరకు క్లాస్ హీరోగా లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకొని ఇస్మార్ట్ శంకర్ సినిమా తో తన లో ఉన్న మాస్ ను ప్రేక్షకులకు చూపించి మంచి ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. ఇక ఎవరూ ఊహించని విధంగా క్లాస్ హీరోలు కూడా మాస్ హీరోలు గా మారడానికి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు వస్తున్న చాలా మంది కొత్త హీరోలి మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నం చేస్తూ ఉండటం గమనార్హం.

- Advertisement -

స్టార్ డైరెక్టర్ ల డైరెక్షన్ లో నటిస్తూ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటడానికి ప్రయత్నిస్తున్నారు. ఇకపోతే వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న రామ్ పోతినేని కూడా ప్రస్తుతం లింగుస్వామి డైరెక్షన్ లో ది వారియర్ సినిమాలో మాస్ ఎలిమెంట్స్ చూపించడానికి సిద్ధమవుతున్నాడు. మాస్ కథాంశంతో వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది. ఇక దీని తర్వాత బోయపాటి శ్రీను డైరెక్షన్లో కూడా మరో చిత్రం చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

ఇకపోతే నితిన్ కూడా మాస్ ఇమేజ్ ను సొంతం చేసుకోవడానికి పాకులాడుతున్నారు. ఇక ఈయన పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న మాచర్ల నియోజకవర్గం సినిమాలో నటిస్తున్నారు. ఎమ్ ఎస్ రాజశేఖర్ రెడ్డి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. మరొకవైపు నాగచైతన్య కూడా మాస్ ఇమేజ్ను సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈయన పరుశురాం .. వెంకట్ ప్రభు డైరెక్షన్లో సినిమాలకు నాగచైతన్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది . మరి ఈ సినిమాల ద్వారా ఈ హీరోలకు మాస్ ఇమేజ్ లభిస్తుందో లేదో తెలియాల్సి వుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...