ప్రస్తుతం దేశాన్ని వణికిస్తున్న కరోనా తో అందరూ ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని తెగ టెన్షన్ పడుతూ బ్రతుకుతున్నారు. ఈ కరోనా ఎఫెక్ట్ అన్ని ఇండస్ట్రీస్ మీదా బాగా పడింది. ఈ నెల 31 వరకు అన్ని ఇండస్ట్రీస్ మూసి వేయాలని ప్రభూత్వాలు సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా సినిమా ఇండస్ట్రీలు కూడా షూటింగ్స్ బంద్ ప్రకటించాయి. ఈ ఎఫెక్ట్ ఒక్క టాలీవుడ్ మీదే కాదు టోటల్ సౌత్, నార్త్ సినిమా ఇండస్ట్రీల మీదా గట్టిగా పడింది. మనకంటే ముందే కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో షూటింగ్స్ ఆపేశారు. అలాగే ఈ నెల 31 వరకు థియోటర్స్ ని మూసి వేశారు. ఇక బాలీవుడ్ లోను అదే పరిస్థితి నెలకొంది. ఈ నెల 24 న రిలీజ్ కావాల్సిన బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సినిమా సూర్యవంశి సినిమాని మేకర్స్ రిలీజ్ ని పోస్ట్ పోన్ చేశారు.
ఇక మన టాలీవుడ్ కుర్ర హీరోల నుండి మెగాస్టార్ చిరంజీవి లాంటి సీనియర్ స్టార్ హీరో వరకు ఫస్ట్ డే ఫస్ట్ క్లాప్ కొట్టినప్పటి నుంచి థియోటర్స్ లో బొమ్మ పడే వరకు క్షణం ఖాలీగా ఉండకుండా సినిమా కోసమే సమయం కేటాయిస్తారు. ఓ వైపు షూటింగ్ మరో వైపు రిలీజ్ డేట్ ని మిస్ అవకూడదన్న టార్గెట్. అంతేకాదు సినిమా హిట్ టాక్ వచ్చినా యావరేజ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ కోసం సినిమా రిలీజయ్యాక కనీసం ఒక నెలరోజులైనా సక్సస్ మీట్ లని సక్సస్ ట్రూర్స్ అని సినిమాని ప్రమోట్ చేస్తూనే ఉంటారు.
అయితే ఈసారి ఏ సినిమా హడావుడి లేకుండా పోయింది. ఏ సినిమా షూటింగ్స్ జరిపే అవకాశమూ లేదు. అనూహ్యంగా వచ్చి కల్లోలం సృష్టిస్తున్న కరోనాతో స్టార్ హీరోలకు ఊహించని షాకే కాదు కావలసినంత రెస్ట్ కూడా దొరికింది. ప్రస్తుతం విదేశాల నుండి మన దేశంలోకి కూడా కరోనా వస్తుండటం చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా నుండి ఛోటా మోటా మేకర్స్ నిర్మిస్తున్న సినిమాల వరకూ అందరూ షూటింగ్స్ పోస్ట్ పోన్ చేసి కూర్చున్నారు. ప్రభాస్ కూడా జార్జియా షెడ్యుల్ ను నాలుగు రోజుల్లో కంప్లీట్ చేసుకొని తిరిగి ఇండియా బయలుదేరాడు.
ఇక చిరు లాంటి స్టార్ హీరోతో పాటుగా ఎన్.టి.ఆర్, రాం చరణ్, రాం, విజయ్ దెవరకొండ, అల్లు అర్జున్ వంటి .. మిగతా హీరోలు నటిస్తున్న అన్ని షూటింగ్స్ ఆపేయాలని పిలుపినిచ్చింది నిర్మాతల సంఘం. దీంతో ఉన్నపళంగా షూటింగ్స్ కి బ్రేక్ పడింది. దీంతో మన టాలీవుడ్ హీరోలు ఫ్యామిలీతో కలిసి ఇంట్లోనే ఎంజాయ్ చేస్తూ రెస్ట్ తీసుకుంటున్నారు. మహేష్ బాబు – తారక్ – నాని లాంటి వాళ్ళు ఇంట్లోనే తమ పిల్లల తో హాయిగా గడిపేస్తూ హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తానికి కరోనా మన హీరోలని ఖాళీగా కూర్చో బెట్టేసింది.