మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ అంటే ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్టర్ అని చెప్పాలి. ఆయన మార్క్ కామెడీని, పంచెస్ ని ఇంకెవరూ టచ్ చేయలేరు. అంతేకాదు ఆయన తరహా టైటిల్స్ ని ఎవరు పెట్టలేరు. అయితే ఈ మధ్య మాటల మాంత్రీకుడి టైటిల్స్ కాస్త మారుతున్నట్లు జనాలు బాగా గమనిస్తున్నారు. ‘అ’ సెంటి మెంట్ ని వదలకుండా ఇలా టైటిల్స్ పెట్టడంలో ఏదైనా సీక్రెట్ ఉందా అని అందరూ ఆరా తీస్తున్నారు. ఈ సంక్రాంతికి వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమాతో మంచి కమర్షియల్ సక్సెస్ ని అందుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ మాంచి ఊపు మీద ఉన్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో బన్నీ కూడా సూపర్ ఫాం లో అందరికీ పార్టీలిస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు.
ఇక త్రివిక్రమ్ అల వైకుంఠపురములో సినిమా తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారని ఇంతకముందు నుంచే వార్తలు వస్తున్నాయి. తారక్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ సినిమా సక్సస్ ని అందుకున్న సంగతి తెలిసిందే. దాంతో ఇదే కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కించే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలియగానే తారక్ ఫ్యాన్స్ కి ఇప్పటి నుంచే ఉబలాటం మొదలైంది.
ఇక రీసెంట్‌గా ఫిలిం ఛాంబర్ కొత్తగా కొన్ని టైటిల్స్ రిజిస్టర్ చేపించారు ఆయా సినిమాల మేకర్స్. ఆ టైటిల్స్ లో మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-వేణు శ్రీ రాం, ప్రభాస్-రాధా కృష్ణ సినిమాల టైటిల్స్ ఉన్నట్టుగా సమాచారం. ఈ టైటిల్స్‌తో పాటు హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఓ క్లాసిక్ టైటిల్‌ను రిజిస్టర్ చేశారని తెలుస్తోంది. ‘అయినను పోయి రావలే హస్తినకు’ అన్న టైటిల్ ను ఈ మధ్యే రిజిస్టర్ చేపించారట. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో కేవలం త్రివిక్రమ్ దర్శకత్వంలో మాత్రం సినిమాలు నిర్మిస్తారన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే బ్యానర్ ఓ టైటిల్‌ను రిజిస్టర్ చేయటంతో ఆ టైటిల్ మాటల మాంత్రికుడి నెక్ట్స్ సినిమా కోసమే అని టాక్ మొదలైంది.
ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే త్రివిక్రమ్ తన టైటిల్ సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ ‘అ’ అనే అక్షరంతో ప్రారంభమైన టైటిల్. ఈ టైటిల్‌లో క్లాసిక్ టచ్ గమనిస్తే ఖచ్చితంగా త్రివిక్రమ్ తీసే సినిమా టైటిలే అని డిసైడవుతున్నారు. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ కానుంది. కాబట్టి త్రివిక్రం తో ఎన్టీఆర్ ఇంకా చాలా సమయమే పడుతుంది. అయితే ఈ మధ్యకాలంలో త్రివిక్రమ్ పెట్టే టైటిల్స్ బాగా పొడవుంటాన్నాయన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. గురూజీ పెట్టినా కాని జనాలు మాత్రం సగం పేరునే .. అంటే అరవింత సమేత, అల అని మాత్రమే పిలుస్తున్నారు.