Amitabh Bachchan: ముసలోడా..అంటూ అమితాబ్ బచ్చన్‌పై ట్రోలింగ్..దిమ్మతిరిగే రిప్లయి ఇచ్చిన బిగ్ బీ

-

బాలీవుడ్ బిగ్ బీ, మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 80 ఏళ్ల వయసులోనూ ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనదైన శైలిలో డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తూ సినీ అభిమానులను అలరిస్తున్నారు.

బాలీవుడ్ బాద్ షాగా కొనసా..గుతున్న అమితాబ్ బచ్చన్ ను దేశవ్యాప్తంగా సినీ రంగ ప్రముఖులందరూ అభిమానిస్తుంటారు. దేశవ్యాప్తంగా ఆయనకు అభిమానులున్నారు. ఇక ఆయన సోషల్ మీడియా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంటుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తనకు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తుంటారు అమితాబ్. తాజాగా ఆయన పెట్టిన పోస్టు పట్ల కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ట్రోల్ చేశారు. కాగా, వారికి దిమ్మదిరిగిపోయే రిప్లయి ఇచ్చారు బిగ్ బీ.

ఉదయం 11.30 గంటలకు ఫేస్ బుక్ లో ‘‘గుడ్ మార్నింగ్’’ అని పోస్టు చేశాడు. కాగా, ఇంత ఎర్లీ మార్నింగ్ విష్ చేయడం ఏంటని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరొక నెటిజన్..ఇది ‘‘మధ్యాహ్నం ముసలోడా’’ అని పోస్టు పెట్టాడు. వారి నెగెటివ్ కామెంట్స్ కు బిగ్ బీ ఏ మాత్రం అసహనం వ్యక్తం చేయకుండా డిప్లొమాటిక్ వేలోనే దిమ్మదిరిగిపోయే రిప్లయి ఇచ్చాడు.

తనను అపహాస్యం చేసినందకు థాంక్స్ చెప్తూ…తాను గత అర్ధరాత్రి నుంచి మార్నింగ్ వరకూ షూటింగ్ లో పాల్గొన్నానని, దాంతో మార్నింగ్ లేవడం ఆలస్యమైందని, కాబట్టే లేట్ గా విషెస్ చెప్పానన్నాడు అమితాబ్. ఈ క్రమంలోనే ముసలోడా అన్న వ్యక్తికీ రిప్లయి ఇచ్చాడు. ‘‘మీరు చాలా కాలం బతకాలని ప్రార్థిస్తున్నా..అయితే మిమ్మల్ని ఎవరూ ముసలోడు అని పిలిచి అవమానించకూడదని కోరుకుంటున్నా’’ అని స్ట్రాంగ్ రిప్లయి ఇచ్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news