కమల్ హాసన్ కు గోల్డెన్ వీసాను మంజూరు చేసిన యూఏఈ

-

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) తమ ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ వీసాను మంజూరు చేసింది. ఈ విషయాన్ని కమల్ హాసన్ తన ట్విటర్ వేదిక ద్వారా తెలియజేశారు.” యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి గోల్డెన్ వీసా పొందడం నాకు గౌరవంగా ఉంది. లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ అహ్మద్ అల్ మర్రి, డైరెక్టర్ జనరల్ GDRFA కి ధన్యవాదాలు. ప్రతిభావంతులు మరియు సృజనాత్మక వ్యక్తులకు మద్దతు ఇచ్చినందుకు దుబాయ్ ఫిల్మ్ మరియు కమిషన్ కు ధన్యవాదాలు”అంటూ ట్వీట్ చేశారు.

అయితే కమల్హాసన్ ఒక్కడికే కాదు అతని కంటే ముందు నాజర్, మమ్ముట్టి, మోహన్ లాల్, టోవినొ థామస్, అమలాపాల్, మరియు షారుక్ ఖాన్ తో సహా పలువురు నటులు ఈ గోల్డెన్ వీసాని అందుకున్నారు. అయితే ఈ గోల్డెన్ వీసా అనేది దీర్ఘకాలిక నివాస వీసా వ్యవస్థ. ఇది ఐదు నుంచి పది సంవత్సరాల మేరకు పొడిగించబడుతుంది. ఇది వివిధ రంగాలలోని నిపుణులు, పెట్టుబడిదారులకు మంజూరు చేయబడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news