పాపం..వెంకటేష్ తన భార్యను ఎప్పుడూ బయటకు కూడా రానివ్వడట..కారణం..?

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఉండే హీరోలు లేదా హీరోయిన్లు వివాహ జీవితం తర్వాత వారి ఫ్యామిలీని ప్రేక్షకులకు పరిచయం చేయాలని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. అంతేకాదు అభిమానులతో అప్పుడప్పుడు ముచ్చటిస్తూ బాగా పాపులారిటీని సంపాదించుకుంటూ ఉంటారు. ఇక చిరంజీవిని మొదలుకొని నేటితరం కొత్త హీరోలు కూడా తమ కుటుంబ సభ్యులను, వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఉన్న విషయం మనకు తెలిసిందే. కానీ దగ్గుబాటి ఫ్యామిలీ మాత్రం ఎప్పుడూ ఏ రోజు కూడా తమ కుటుంబ సభ్యుల ఫోటోలను కానీ వారి విషయాలను కానీ ఎప్పుడూ షేర్ చేసుకోరు. అంతేకాదు సినీ ఇండస్ట్రీలో జరిగే ఏ ఫంక్షన్ కి కూడా వారు అతిధులుగా హాజరుకారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే వెంకటేష్ గురించి అభిమానులు తెలుసుకోవాలని ఎంతో ఆత్రుత చూపించినప్పటికీ ఆయన మాత్రం తన వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన ఏ విషయాన్ని కూడా అభిమానులతో పంచుకోకపోవడం గమనార్హం.

ఇకపోతే హీరో వెంకటేష్ ఎప్పుడు కూడా అతిగా మాట్లాడటం.. అనవసరపు వివాదాల్లోకి వెళ్లడం.. లాంటివి ఎప్పుడూ చేయరు. ఇక ఆయన కెరియర్ మొత్తం సాఫీగా సాగడానికి కారణం ఆయన తండ్రి ఒకరైతే.. మరొక కారణం ఆయన జీవిత భాగస్వామి నీరజారెడ్డి అని అంటూ ఉంటారు. ఎప్పుడూ బయట కనిపించని నీరజారెడ్డి చాలా సింపుల్ గా ఉంటారు. ఇక ఈ విషయాలు ఎలా ఉన్నా వెంకటేష్ భార్య గురించి తెలియని ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. నీరజ రెడ్డి చిత్తూరు జిల్లా గంగవరపు సుబ్బారెడ్డి కుమార్తె. వెంకటేష్ నీరజలకు మొత్తం నలుగురు సంతనం, వారిలో ముగ్గురమ్మాయిలు.. ఒక అబ్బాయి ఉన్నారు. ఇక నీరజ – వెంకటేష్ కూతుర్ల పేరు ఆశ్రిత, హాయవాహిని ,భావన కాగా కొడుకు పేరు అర్జున్ రామనాథ్ దగ్గుబాటి..Relationship goals! Venkatesh Daggubati's wife Neeraja clicks her superstar husband on a cool evening | Telugu Movie News - Times of Indiaఇంట్లో కుటుంబ సభ్యులకు అవసరమయ్యే ప్రతి విషయాన్ని కూడా ఆమె దగ్గరుండి చూసుకుంటారు.. వెంకటేష్ తన భార్యను, పిల్లలను ఎప్పుడూ కూడా సినిమా ఫంక్షన్లకు కానీ బయట జరిగే ప్రోగ్రామ్లకు కానీ తీసుకురాడు. వెంకటేష్ కొడుకు అర్జున్ తప్ప వెంకటేష్ కూతుర్లు ఎవరూ కూడా ఈ కార్యక్రమాలలో కనిపించరు. వెంకటేష్ అంటే నీరజకు చాలా ఇష్టం.. షూటింగ్ కి వెళ్లే ప్రతిరోజు కూడా దేవుడు హారతి ఇచ్చి కారుకి తను ఎదురొచ్చి మరి పంపిస్తుంది.. అమెరికాలో ఎంబీఏ పూర్తి చేసిన నీరజ బయట ప్రపంచాన్ని మాత్రం చూడడానికి నోచుకోలేదని చెప్పాలి. నిజానికి దగ్గుబాటి కుటుంబానికి ఉన్న కట్టుబాట్ల కారణంగా వెంకటేష్ తన భార్యను ఎప్పుడూ బయటకు తీసుకురాడు అని సమాచారం.