మెదడును తినే అమీబా వైరస్‌తో బాలుడు మృతి!

-

అమెరికాలో మరో అరుదైన వైరస్ వల్ల బాలుడు మృతి చెందాడు. ఆ బాలుడికి మెదడును తినే అమీబా వైరస్ సోకింది. ఈ వైరస్ పేరు నయిగ్లేరియా ఫొలేరి. ఈ వైరస్ వల్ల అమెరికాలో మొట్టమొదటి మరణ కేసు నమోదైంది. నెబ్రస్కా హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ డిపార్ట్‌ మెంట్ ప్రకారం.. ఒమాహాలోని డగ్లస్ కౌంటీకి చెందిన బాలుడికి మెదడు తినే అమీబా వైరస్ సోకింది. ఆదివారం నాడు ఆ బాలుడు ఎల్కార్న్ నదిలో ఈత కొట్టాడు. బహుశా ఆ నదిలోనే బాలుడుకు అమీబా వైరస్ సోకినట్లుగా వైద్యులు చెబుతున్నారు.

అమీబా-మెదడు
అమీబా-మెదడు

అప్పటి నుంచే బాలుడు అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో కుటుంబసభ్యులు ఆస్పత్రిలో జాయిన్ చేశారు. ఈ డిసీజ్ వల్ల బాలుడు మృతి చెందినట్లు డగ్లస్ కౌంటీ హెల్త్ డిపార్ట్ మెంట్ తెలియజేసింది. నయిగ్లేరియా ఫోలేరి అనేది అరుదుగా కనిపించే ప్రాణాంతకమైన వైరస్ అమీబా. ఇది సాధారణంగా ఉష్ణంగా ఉన్న కొలనులు, నదులు, చెరువుల్లో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ముక్కు ద్వారా ప్రవేశించి.. నేరుగా మెదడుకు చేరుకుంటుంది. 1962లో తొలిసారిగా ఈ అమీబాను గుర్తించారు. అప్పటి నుంచి 154 మందికి సోకగా.. నలుగురు మాత్రమే బతికారు.

Read more RELATED
Recommended to you

Latest news