ప్రస్తుతం మెగా కోడలు ఉపాసన గర్భవతి అయ్యారన్న వార్త చిరంజీవి స్వయంగా తన ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే. ఆ రోజు నుంచి ఉపాసన ఆరోగ్య విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నేటిజన్ లు ఆమెకు సూచిస్తున్నారు.
పదేళ్ల తర్వాత ఉపాసన, రాంచరణ్ తల్లిదండ్రులవుతున్నట్టు ప్రకటించడంతో చరణ్ తో పని చేసిన సెలబ్రిటీలు.. సినీ ప్రేక్షకులు.. ఫ్యాన్స్ ఇలా ప్రతి ఒక్కరు ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం. ఉపాసన రాంచరణ్ లకు కొడుకు పుట్టినా.. కూతురు పుట్టినా ఏ పేరు పెట్టాలనే టెన్షన్ అవసరం లేకుండా ఇప్పటికే పేర్లను కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా సంక్రాంతి పండుగ నేపథ్యంలో… బేబీ బంప్ తో ఉన్న ఫోటోలను షేర్ చేసింది ఉపాసన. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.