మెగా కోడలి బర్త్​డే స్పెషల్​.. ఆమె గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలివే!

-

మెగా కోడలు రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.. అపోలో ఆసుపత్రి బాధ్యతలు చేపడుతూనే.. మరోవైపు ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తున్నారు. కాగా.. ఈరోజు ఉపాసన పుట్టినరోజు. ఈ సందర్భంగా మనలోకం స్పెషల్ స్టోరీ…

సినిమా హీరోల భార్యలు బయట ప్రపంచానికి ఎక్కువగా కనిపించరు. ఎక్కడైనా వేడుకల్లో సడన్​గా దర్శనం ఇచ్చేసరికి షాక్ అవుతాం. అయితే మెగా కోడలు మాత్రం అందుకు విరుద్ధమనే చెప్పాలి. మెగా కోడలు ఉపాసన కామినేని సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా ఉంటూ… సామాజిక సేవ కార్యక్రమాల్లో సైతం పాల్గొంటారు. ప్రస్తుతం ఆమెకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ హీరోయిన్స్​కు ఉన్న రేంజ్​లో ఉన్నారు.

టాలీవుడ్​లో ఉన్న మోస్ట్​ క్రేజీ కపుల్స్​లో రామ్​చరణ్, ఉపాసన ఒకరు. వీరిద్దరూ వారి కెరీర్స్​లో వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ … ఖాళీ దొరికినప్పుడల్లా కలిసి సంతోషంగా గడుపుతుంటారు. సోషల్మీడియా లో ఒకరిపై ఇంకొకరు తమ ప్రేమను చాటుకుంటుంటారు. అంతే కాదు.. ఈ మధ్య విదేశీ టూర్​కు కూడా వెళ్లొచ్చారు. ఇక అన్నింటికి మించి ఉపాసన సేవా గుణం గురించి అందరికీ తెలిసిందే. ఉపాసన లాంటి మంచి భావాలు ఉన్న వ్యక్తి భార్య కావడం తన అదృష్టమని చరణ్ ఇప్పటికే చాలా సార్లు మీడియా వేదికగా చెప్పారు.

ఆరోగ్యం పై అవగాహన: ఉపాసన ఆరోగ్యం పట్ల ఎంత జాగ్రత్తగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలానే ప్రజల్లో హెల్త్ ఫై అవగాహన పెంచడానికి టిప్స్ చెబుతూనే ఉంటారు. ఫిట్‏నెస్​కు సంబంధించిన విషయాలు చెప్తుంటారు.

జంతువులపై అమిత ప్రేమ: సంరక్షణ గురించి ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ.. వీడియోస్ షేర్ చేస్తుంటారు. జంతువులు, పక్షుల సంరక్షణకు సంబంధించిన విషయాలను.. వాటి జాగ్రత్తలు గురించి షేర్ చేస్తూంటారు. నెహ్రూ జూపార్కులోని అరుదైన ఎసియాటిక్‌ జాతికి చెందిన ఓ సింహాల జంటను అప్పట్లో ఉపాసన గారు దత్తత తీసుకున్నారు. అంతకుముందు జూలోని ఏనుగు రాణిని కూడా దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. అంతే కాదు ఇంట్లో రెండు కుక్కలను, గుర్రాలను పెంచుతున్నారు.

ఆమె ప్రస్థానం: ప్రముఖ వ్యాపార వేత్త, అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి మనమరాలు ఉపాసన. తల్లిదండ్రులు శోభ కామినేని, అనిల్ కామినేని.. 20 జూలై 1989లో ఉపాసన జన్మించారు. ఆమెకు నలుగురు అక్కా చెల్లెల్లున్నారు. వీరిలో ఉపాసన రెండో వ్యక్తి. ఉపాసన కామినేని చిన్న వయసు నుంచే వ్యాపార సామ్రాజ్య సంగతులను నేర్చుకున్నారు. పదిహేనేళ్లకే యు ఎక్సేంజ్ సేవా సంస్థను నెలకొల్పి పాత స్కూల్ పుస్తకాలను సేకరించి.. పేద పిల్లలకు అందించే వారు.

ఉపాసన సేవా కార్యక్రమాలు: అంతేకాదు మురికివాడల్లో అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులకు అపోలో హెల్త్ సిటీలో చికిత్స చేయించే వారు. ఆమె లండన్ రీజెన్ట్స్ కాలేజీ నుంచి డిగ్రీ పట్టా అందుకున్నారు. రామ్ చరణ్ ఉపసానలకి 14 జూన్​ 2012లో పెళ్లి జరిగింది. పాతికేళ్లకే ఒత్తిడితో కూడిన బాధ్యతలు తీసుకున్నా… ఏ రోజు విస్మరించలేదు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ హాస్పిటల్ గ్రూప్​లలో మూడవ స్థానంలో ఉన్న అపోలో హాస్పిటల్​కి సంబంధించిన మేనేజ్మెంట్ పనులను ఉపాసన దగ్గరుండి చూసుకుంటున్నారు.

ప్రస్తుతం అపోలో చారిటీకి వైస్ ప్రెసిడెంట్​గా వ్యవహరిస్తున్నారు. పేపర్లను, పుస్తకాలను చదవడమే కాదు ‘బి పాజిటివ్’ అనే హెల్త్ మ్యాగజైన్​కు ఎడిటర్​గా ఉన్నారు. ఇన్ని పనులను విజయవంతంగా నిర్వహిస్తూనే కొణిదెల ఇంట కోడలుగా కుటుంబ సభ్యులందరి మనసులను గెలుచుకున్నారు. ఈ సందర్భంగా మెగా కోడలికి మనలోకం తరఫున పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం.

Read more RELATED
Recommended to you

Latest news