కరకట్ట విస్తరణ చేయాల్సిందే : భట్టి విక్రమార్క

-

గత వారం తెలంగాణలో నెలకొన్న భారీ వర్షాలకు గోదావరి పరివాహక ప్రాంతాలు మంపుకు గురయ్యాయి. అయితే పోలవరం ప్రాజెక్ట్‌ ఎత్తు పెంచడం వల్లే భద్రాచలంలో ముంపు ఏర్పడిందటూ వ్యాఖ్యలు తెరమీదకు వచ్చాయి. ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మూడు మీటర్ల పెంచుతూ ఉంటే..మీరేం చేస్తున్నారని.. నిండా మునిగిన తర్వాత మాట్లాడటం ఏంటి..? అని కేసీఆర్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు. పోలవరం ఎత్తు పెంచుతూ ఉంటే మీరేం చేస్తున్నారని, రోజు గూగుల్ మ్యాప్ చూసే కేసీఆర్‌… పోలవరం ఎత్తు ఎందుకు ఆపలేదన్నారు. జనం. నష్టపోకుండా ఏం చేస్తే బాగుంటుంది అనేది ఆలోచన చేయాలని, భద్రాచలం కోసం ఏం చేస్తారో ప్రజలకు చెప్పాలన్నారు భట్టి. ముంపు గ్రామాల పై ఏం చేస్తారో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. కరకట్ట విస్తరణ చేయాల్సిందేనని, వైఎస్‌ నిధులు కూడా మంజూరు చేశారన్నారు.

Telangana Assembly: Congress leader Mallu Bhatti Vikramarka miffed with  Speaker for cutting off mike- The New Indian Express

ప్రత్యేక రాష్ట్రంలో వైఎస్‌ మంజూరు చేసిన నిధులు విడుదల కూడా చేయలేదని, ఏపీ నీ తెలంగాణ లో కలపండి అని ఏపీ నేతలు చెప్పడం లో లాజిక్ లేదన్నారు. 3 వేల ఎకరాల ముంపునే మహారాష్ట్ర ఒప్పుకోలేదని, 2 లక్షల ఎకరాల ముంపు ను కేసీఆర్‌ ఎలా ఒప్పుకున్నాడంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు వరద వల్ల మునిగిపోయారని, నేనే ప్రభుత్వంలో ఉంటే… వరద ముంపు.. పై 24 గంటల్లో సమాధానం చెప్పేవనంటూ ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ చెప్పిన క్లౌడ్ బరస్ట్ స్టేట్మెంట్ చూస్తే… నవ్వాలో..ఏడ్వాలో తెలియడం లేదని భట్టి ఎద్దేవా చేశారు. పాలకులు సీరియస్ గా సమస్యను తీర్చేలా ఉండాలని, జనం నీ డైవెర్ట్ చేసి రాజకీయం చేయొద్దన్నారు. విదేశీ కుట్ర ఉంటే.. కేంద్రం కి సమాచారం ఇవ్వాలని, సీఎం దగ్గర సమాచారం ఉంటే… కేంద్రం వచ్చి తెలుసుకుని పోవాలన్నారు. ఇద్దరూ అది చేయట్లేదని ఆయన మండిపడ్డారు.

 

Read more RELATED
Recommended to you

Latest news