“వాల్తేరు వీరయ్య” మెగా మాస్ ట్రైలర్ రిలీజ్.. అన్నయ్య వస్తే పూనకాలు, అడుగేస్తే అరాచకాలు

-

బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. మెగాస్టార్ చిరంజీవి – మాస్ మహారాజ రవితేజ చాలా కాలం తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై మెరవబోతున్నారు. అన్నయ్య సినిమాలో మెరిసిన ఈ క్రేజీ కాంబినేషన్ మళ్లీ సందడి చేసేందుకు రెడీ అయింది. ఈ చిత్రంలో రవితేజ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

సంక్రాంతి కానుకగా బరిలోకి దిగుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. చాలా రోజుల తర్వాత చిరంజీవి పూర్తిస్థాయి మాస్ లుక్ లో కనిపించనుండడంతో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా వాల్తేరు వీరయ్య ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ యూనిట్ వరుస అప్డేట్ లతో ప్రేక్షకులలో మంచి హైప్ ని క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

తాజాగా నేడు వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని ఆర్కే బీచ్ లో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ఈ ట్రైలర్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకునే విధంగా ఉంది. అలాగే చిరంజీవి డైలాగ్స్, రవితేజ ఎంట్రీ అదిరిపోయాయి. 2 నిమిషాల 50 సెకండ్లు ఉన్న ఈ ట్రైలర్ అధ్యంతం ఆకట్టుకునే విధంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news