ఎఫ్-2 ఉత్సాహంతో వెంకీ మామాకు క్రేజ్

-

విక్టరీ వెంకటేష్ లోని కామెడీ యాంగిల్.. పంచుల ప్రతిభని సరిగా వాడితే ఎలా ఉంటుందో ఆ సినిమా ఎలాంటి బ్లాక్ బస్టర్ అవుతుందో రీసెంట్ గా వచ్చిన ఎఫ్-2 సినిమా ద్వారా నిరూపితమైంది. వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి మల్టీస్టారర్ మూవీగా చేసిన ఎఫ్-2 సక్సెస్ ఇద్దరి హీరోలకు మంచి క్రేజ్ తెచ్చింది. అయితే ఈ సినిమా తర్వాత వెంకటేష్ మరో మల్టీస్టారర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది.

అక్కినేని నాగ చైతన్య, వెంకటేష్ రియల్ లైఫ్ మామా అల్లుల్లు ఇద్దరు కలిసి వెంకీ మామ సినిమా చేస్తున్నారు. ఎఫ్-2 ఇచ్చిన జోష్ తో వెంకటేష్ చేయబోయే మల్టీస్టారర్ సినిమాపై మరింత ఎక్సైటింగ్ గా ఉన్నాడట. జై లవ కుశ డైరక్టర్ బాబి డైరక్షన్ లో ఈ సినిమా వస్తుంది. ప్రస్తుతం నాగ చైతన్య మజిలి సినిమా చేస్తున్నాడు. త్వరలోనే అది పూర్తి చేసుకుని వెంకీ మామ షూటింగ్ లో జాయిన్ అవుతాడట. ఎఫ్-2 హిట్ అయ్యింది కాబట్టి బిజినెస్ పరంగా వెంకీ మామకు బాగానే కలిసి వచ్చేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news