తెదేపా – జనసేన మైత్రి మరో సారి బయటపడింది … విమర్శించుకున్న వారే నేడు పొగడ్తలు, సానుభూతితో వ్యవహరించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇందులో భాగంగా.. ముఖ్యమంత్రి చంద్రబాబుపై కక్ష సాధించేందుకే తెరాస నేతలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతిస్తున్నారని గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ ఇటీవలే వ్యాఖ్యానించారు. అయితే తాజాగా పవన్‌ను విమర్శించొద్దని చంద్రబాబు తెదేపా నేతలకు హుకుం జారీచేసినట్లు సమాచారం.శనివారం టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు, పార్టీ బాధ్యులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడిన చంద్రబాబు.. జనసేన నేతల జోలికి, పవన్ కల్యాన్ని ఎవ్వరూ వివమర్శించవద్దని తెలిపారు. వీలైదే రాష్ట్రానికి ప్రధాని మోదీ చేసిన అన్యాయంపై గళం విప్పాలన్నారు.
రాజకీయంగా అటు కేసీఆర్ – ఇటు జగన్‌ల దోస్తీని తెలుగు ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించాలని వారికి సూచించారు. పవన్ తెదేపా నేతలను తీవ్రంగా దుర్భాషలాడారని ఓ సందర్భంలో తెదేపా సీనియర్ నేత పేర్కొనగా…సీఎం ఆగ్రహంతో ‘ డు వాట్ ఐ సే’ అంటూ వారిని ఆదేశించడంతో తెదేపా వర్గాల్లో సర్వత్రా చర్చనీయాంశమైంది.